Begin typing your search above and press return to search.

థాంక్యూ చై.. గుడ్ బై సామ్.. అదేంటి అలా అనేశారు!

By:  Tupaki Desk   |   29 April 2022 4:30 PM GMT
థాంక్యూ చై.. గుడ్ బై సామ్.. అదేంటి అలా అనేశారు!
X
ఒక‌ప్పుడు మాయ చేసిన స‌మంత ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఒక‌ప్పుడు సైలెంట్ కిడ్ మాదిరి ఉన్న నాగ చైత‌న్య యాంగ్రీ యంగ్ మేన్ అయిపోయారు. అందుకే యాంగ్రీ లుక్స్ పై అక్కినేని అభిమానులు ఆనందిస్తున్నారు. ఇదే స‌మ‌యాన ఆయ‌న ఒక‌ప్ప‌టి జోడి స‌మంత ను శాకుంత‌లం అనే మూవీ పోస్ట‌ర్ లో చూసి, ఫ‌స్ట్ లుక్ చూసి తిట్టుకుంటున్నారు. ఆ విధంగా చై కు థాంక్స్. సామ్ కు సారీ.

కంగారుప‌డ‌వ‌ద్దు. చై నటించిన థాంక్యూ మూవీ ఎక్క‌డిదాకా వ‌చ్చిందో తెలియ‌దు. కానీ వెబ్ సిరీస్ అప్డేట్ అయితే వ‌చ్చింది. ఆవిధంగా రాబోయే కాలంలో దూత‌గా ముందుకు రాబోతున్న చై కు థాంక్యూ చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో సామ్ న‌టించిన శాకుంత‌లంలో ఆమె లుక్ అస్స‌లు బాలేదు. దీంతో గుడ్ బై సామ్ అని కొంద‌రు అంటున్నారు కూడా ! ఎందుక‌ని ?

తెలుగులో వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న హీరో అక్కినేని నాగచైతన్య..లవ్ స్టోరీ, 'బంగార్రాజు' సినిమా లతో బ్యాక్ టు బ్యాక్ హిట్ లను అందుకున్నాడు..చై ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ కూడా థియేటర్లలో విడుదల అయ్యాయి. మొదటి సారి ఓ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.అమెజాన్ ప్రైమ్ రూపొందించే 'దూత' అనే వెబ్ సిరీస్‌తో చైతూ డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి ఎంటర్ అవుతున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి 'మనం' లాంటి కుటుంబ కథా చిత్రాలను అందించిన ఘనత విక్రమ్ కె కుమార్.. ఇప్పుడు తెరకెక్కుతున్న ఈ సిరీస్‌కు కూడా ఈయనే దర్శకత్వం వహిస్తున్నాడు.

అమెజాన్ ప్రైమ్ వారు ఏప్రిల్ 28 న తమ ఫ్లాట్ ఫామ్ లో రూపొందిస్తున్న పలు వెబ్ సిరీస్ టైటిల్స్‌ను ప్రకటించారు. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో నాగచైతన్య 'దూత' సిరీస్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య పోస్టర్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఆ లుక్ మజిలీ లో చై లుక్ లాగా కనిపిస్తుంది. ఎవరితోనో సీరియస్ ఫోన్ మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తాడు.. పోస్టర్ ను చూస్తుంటే ఈ సిరీస్ లో చైతు బాగా సీరియ‌స్ గా, కోపిష్టిగా కనిపించనున్నారని తెలుస్తుంది.

ప్రియా భవానీ శంకర్, పార్వతీ తిరువోత్తు, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ సిరీస్‌కు విక్రమ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యహరిస్తున్నాడు. ఈ సిరీస్ కు సంబంధించిన గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. చైతూ లుక్ ను కూడా విడుదల చేశారు. ఇందులో చైతూ జర్నలిస్ట్‌గా నటిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఈ లుక్ అక్కినేని అభిమానులకు బాగా నచ్చింది. మరో వైపు సమంత నటించిన ' శాకుంతలం' పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అది విమర్శలకు దారి తీసింది. చై లుక్ ఆకట్టుకోవడం విశేషం..

అతి త్వరలో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సిరీస్ నాగచైతన్య కెరియ‌ర్‌కు మైలు రాయిగా నిలిచిపోతుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇక ఇదివ‌ర‌కే వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా కూడా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.. ! థాంక్యూ పేరుతో ఆ సినిమా రూపొందుతుంది. రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.. ఈ చిత్రం లో చై హాకీ ప్లేయర్ గా కనిపించనున్నారు. షూటింగ్ పనులు పూర్త‌య్యాయి.. త్వరలోనే ఆ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు.