Begin typing your search above and press return to search.

ఏంటీ.. RRR ప్యాచ్ వర్క్ ఇంకా పెండింగ్ ఉందా..?

By:  Tupaki Desk   |   17 July 2021 1:12 PM IST
ఏంటీ.. RRR ప్యాచ్ వర్క్ ఇంకా పెండింగ్ ఉందా..?
X
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్ ఆర్ ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ పై చూపిస్తున్నారు జక్కన్న. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ - హాలీవుడ్ భామ ఒలివియా మోరిష్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ - సముద్రఖని - శ్రియా లతో పాటుగా పలువురు హాలీవుడ్ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'ఆర్ ఆర్ ఆర్' సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం ఇప్పటికే పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. రెండు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని తెలిపారు. అయితే ప్రతీ సీన్ ని పర్ఫెక్ట్ వచ్చే వరకూ చెక్కే జక్కన్న.. మరో రెండు మూడు రోజుల షూటింగ్ పెట్టుకున్నారట. టాకీ పార్ట్ లోని ఈ ప్యాచ్ వర్క్ కోసం RRR హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ మళ్ళీ సెట్స్ లో అడుగుపెట్టారట. వచ్చే వారం ప్రమోషనల్ సాంగ్ షూట్ చేయడానికి ముందే రాజమౌళి ఈ ప్యాచ్ వర్క్ పూర్తి చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

ఇకపోతే "ఆర్ ఆర్ ఆర్" చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల విడుదలైన పోస్టర్స్ - లేటెస్టుగా వచ్చిన 'రోర్ ఆఫ్ RRR' మేకింగ్ వీడియో ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి. కానీ ఈ సినిమాకి సంబంధించిన వారెవ్వ‌రూ కూడా రిలీజ్ డేట్ మీద ఎక్కడా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో సినిమా ఆ టైమ్ కి డెలివ‌రీ అవుతుందో లేదో ప్ర‌స్తుతానికి క్లారిటీ లేదని.. కానీ దసరా టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా రాజమౌళి మాత్రం చెప్పిన సమయానికి సినిమాని అందించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు 'ఆర్.ఆర్.ఆర్' పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు చూసుకుంటున్నారు జక్కన్న. ఇంక మూడు నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి.. ఆగస్టు చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి ఫుల్ ఫోకస్ పోస్ట్ ప్రొడక్షన్‌ మీద పెట్టాలని దర్శకుడు ప్లాన్ చేసుకున్నారు. అంతేకాదు ప్రమోషన్స్ కూడా వేగవంతం చేయడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఇవన్నీ జరగాలంటే వీలైనంత త్వరగా సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ చేయాలని RRR టీమ్ భావిస్తోంది.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం రాజమౌళి తో పాటుగా ఇతర కుటుంబ సభ్యులు కూడా బాగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ కీరవాణి సంగీతం - నేపథ్య సంగీతం చూసుకుంటుంటే.. రాజమౌళి తనయుడు కార్తికేయ ప్రమోషన్స్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. రీసెంటుగా విడుదలైన 'ఆర్ ఆర్ ఆర్ గర్జన' మేకింగ్ వీడియోని కూడా కార్తికేయ దగ్గర ఉండి చూసుకున్నారట. మొత్తం మీద అక్టోబర్ 13 ను టార్గెట్ పెట్టుకుని జక్కన్న అండ్ టీమ్ రాత్రింబవళ్లు కష్ట పడుతున్నారని తెలుస్తోంది.

కాగా, 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రాసుకున్న కల్పిత కథతో రూపొందిస్తున్నారు. రామరాజు గా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ పీరియాడికల్ డ్రామాకు కథ అందించారు. బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.