Begin typing your search above and press return to search.

'విక్రాంత్ రోణ' రిలీజ్ డేట్ టీజర్.. సూపర్బ్ గా ఉందన్న మెగాస్టార్..!

By:  Tupaki Desk   |   2 April 2022 6:44 AM GMT
విక్రాంత్ రోణ రిలీజ్ డేట్ టీజర్.. సూపర్బ్ గా ఉందన్న మెగాస్టార్..!
X
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప టైటిల్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ''విక్రాంత్ రోణ''. ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్రీడీ ఫార్మాట్ లో ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

నేడు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని 'విక్రాంత్ రోణ' మూవీ సరికొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూలై 28న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.

'విక్రాంత్ రోణ' రిలీజ్ డేట్ టీజర్‌ ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి - హిందీలో సల్మాన్ ఖాన్ - మలయాళంలో మోహన్ లాల్ - తమిళంలో శింబు వంటి స్టార్ హీరోలు విడుదల చేయడం విశేషం. కన్నడ - ఇంగ్లీష్ సహా మొత్తం 6 ప్రధాన భాషల్లో ఈ సినిమా బిగ్ స్క్రీన్స్ మీదకు రాబోతోంది.

ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ''ఇది అద్భుతంగా కనిపిస్తోంది! కిచ్చా సుదీప్ నటించిన అడ్వెంచర్ థ్రిల్లర్ 'విక్రాంత్ రోణ' రిలీజ్ డేట్ టీజర్‌ ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు మరియు మొత్తం టీమ్ కి నా శుభాకాంక్షలు!'' అని పేర్కొన్నారు.

నలుగురు పిల్లలు ఓ కథ కోసం నాన్నమ్మ డైరీ కోసం వేటుకుటుండగా.. ఆ కథలో బూచోడిగా కిచ్చా సుదీప్ ని పరిచయం చేస్తూ సాగిన 'విక్రాంత్ రోణ' రిలీజ్ డేట్ టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. అత్యున్నత సాంకేతిక విలువలతో హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమా రూపొందినట్లు అర్థం అవుతోంది.

'విక్రాంత్ రోణ' చిత్రానికి అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇందులో సుదీప్ సరసన నీతా అశోక్‌ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో కనిపించనుంది. నిరూప్ భండారి - రవిశంకర్ గౌడ - మధుసూదన్ రావు - వాసుకి వైభవ్ ఇతర పాత్రలు పోషించారు.

జీ స్టూడియోస్ & కిచ్చా క్రియేషన్స్ సమర్పణలో షాలిని ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా రూపొందించారు. జాక్ మంజునాథ్ - షాలిని మంజునాథ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలంకార్ పాండియ‌న్‌ స‌హ నిర్మాతగా వ్యవహరించారు. బి.అజనీశ్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చగా.. విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు. 'కేజీయఫ్' ఫేమ్ శివకుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

నిజానికి 'విక్రాంత్ రోణ' చిత్రాన్ని 2021 ఆగస్టు 19న విడుదల చేయాలని అనుకున్నారు, కానీ కుదరలేదు. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసినా వీలుపడలేదు. కరోనా కారణంగా రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమాని ఎట్టకేలకు జూలై 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు.