Begin typing your search above and press return to search.

బ‌న్నీకి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది అదే: ఉపేంద్ర‌

By:  Tupaki Desk   |   12 April 2022 11:30 PM GMT
బ‌న్నీకి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది అదే: ఉపేంద్ర‌
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ బ‌డా నిర్మాత అల్లు అరవింద్ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ, మెగా బ్యాక్ గ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్‌తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇటీవ‌లె `పుష్ప ది రైజ్‌`తో పాన్ ఇండియా స్థాయిలోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు.

ప్ర‌స్తుతం ఈయ‌న పుష్ప పార్ట్ 2 పై త‌న పూర్తి ఫోక‌స్‌ను పెట్టాడు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫ‌స్ట్ పార్ట్‌లో ఎర్ర చందనం కూలిగా అల‌రించిన‌ పుష్పరాజ్.. తన తెలివితేట‌ల‌తో, ధైర్యసాహ‌సాల‌తో సిండికేట్‌కు బాస్‌గా ఎలా ఎదిగాడు అన్న‌ది `పుష్ప ది రూల్‌` లో చూపించ‌బోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రం నిర్మితం అవుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా బ‌న్నీపై సీనియ‌ర్ హీరో ఉపేంద్ర ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వీరిద్ద‌రూ `సన్నాఫ్ సత్యమూర్తి` సినిమాలో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం 2015లో విడుద‌లై హిట్‌గా నిలిచింది. ఇందులో ఉపేంద్ర పాత్ర‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. అయితే ఈ మూవీ అనంత‌రం మ‌ళ్లీ `గ‌ని`లో ఓ కీల‌క పాత్ర‌ను పోషించిన ఉపేంద్ర‌.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా `సన్నాఫ్ సత్యమూర్తి` సినిమా షూటింగ్ రోజుల‌ను గుర్తు చేసుకున్న ఆయ‌న‌.. బ‌న్నకి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఏదో కూడా వివ‌రించారు. ఉపేంద్ర మాట్లాడుతూ.. `సన్నాఫ్ సత్యమూర్తి మూవీ చేసేటప్పుడు సెట్లో బన్నీ చాలా సరదాగా ఉండేవాడు. నాకు ఇష్ట‌మైన వంట‌కాల‌ను రోజూ త‌న ఇంటి నుండి తెప్పించేవాడు. న‌న్ను ఓ గిఫ్ట్ లా చూసుకున్నాడు` అని చెప్పుకొచ్చారు.

అయితే ఉపేంద్ర ఒకసారి `మీకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఏది?` అని బ‌న్నీని ప్ర‌శ్నించాడ‌ట‌. అందుకు ఆయ‌న బ‌దులిస్తూ.. `నాకు అసలు దేనిపై పెద్దగా ఇంట్ర‌స్ట్‌ ఉండదు. సినిమాలే నాకు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి. షూటింగ్‌ ఉంటే నాకు ఆ రోజు పండగలా ఉంటుంది` అని చెప్పాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఉపేంద్ర ఇంట‌ర్వ్యూలో చెబుతూ.. యంగ్ స్టార్స్ బ‌న్నీని చూసి నేర్చుకోవాల‌ని, ఆయ‌న‌కు ఉన్నంత ప్యాష‌న్, డెడికేష‌న్ ఉంటే త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతార‌ని చెప్పుకొచ్చారు.