Begin typing your search above and press return to search.

నాని ఒకే చెప్పాడు..ఆ డెరెక్ట‌ర్ కి పెళ్లి షురూ!

By:  Tupaki Desk   |   10 April 2022 12:30 PM GMT
నాని ఒకే చెప్పాడు..ఆ డెరెక్ట‌ర్ కి పెళ్లి షురూ!
X
మెగా మేన‌ల్లుడు సాయితేజ్ హీరోగా యంగ్ మేక‌ర్ సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` తో హ్యాట్రిక్ ని ఖాతాలో వేసుకున్న‌సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందు వ‌రుస‌గా `ప్ర‌తి రోజు పండ‌గే`..`చిత్ర ల‌హరి` చిత్రాల‌తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చేసాడు. ఆ వెంట‌నే `సోలో బ్ర‌తుకు` తో మ‌రో స‌క్సెస్ ద‌క్క‌డంతో హ్యాట్రిక్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఆ యంగ్ మేక‌ర్ సుబ్బు కెరీర్ మాత్రం టాలీవుడ్ లో బిజీ కాలేదు. అంత‌కుముందు కొన్ని త‌మిళ్ సినిమాలు డైరెక్ట్ చేసాడు.

అవేమి అత‌నికి అంత‌గా ఐడెంటిటీ తీసుకురాలేదు. వాటితో పోల్చుకుంటే తెలుగులోనే కాస్త ఫేమ‌స్ అయ్యాడు. కానీ ఏడాదిన్న‌ర పాటు నీర‌క్ష‌ణ త‌ప్ప‌లేదు. తాజాగా యంగ్ మ‌క‌ర్ కి టైమ్ వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. కాస్త ఆల‌స్య‌మైనా ఒక్క దెబ్బ‌కి రెండు పిట్ట‌లు అన్న చందంగా ఒక ఆఫ‌ర్ తో పాటు..పెళ్లి కూడా కుదిరిపోయింది. అవును ఇటీవ‌లే నేచుర‌ల్ స్టార్ నాని కి ఓ లైన్ వినిపించాడు. లైన్ న‌చ్చ‌డంతో ఆ స్ర్కిప్ట్ పై డెవ‌లెప్ మెంట్స్ అడిగారు. తాత్క‌లికంగా నాని క‌థ‌ని లాక్ చేసి పెట్టారు.

దీంతో సుబ్బు ఇక‌పై డెవ‌లెప్ మెంట్స్ పై బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇదే స‌మ‌యంలో యంగ్ మేక‌ర్ కి పెళ్లి కుద‌ర‌డం..ఏప్రిల్ 14న ముహూర్తం పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి వ‌ధువు ఎవ‌రు? ప్రేమ వివాహ‌మా? పెద్ద‌ల కుదిర్చిన పెళ్లా? అన్నది తెలియాల్సి ఉంది.

మొత్తానికి `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` అని త‌న అభిప్రాయాల్ని సినిమా రూపంలో చెప్పిన ద‌ర్శ‌కుడు ఇప్పుడు ఆ సోలో లైఫ్ కి పుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకోవ‌డం విశేషం. అందులోనూ పెళ్లై..పిల్ల‌లు క‌ల్గిన నాని త‌న స్ర్కిప్ట్ ని లాక్ చేసిన త‌ర్వాత సుబ్బు పెళ్లి చేసుకోవ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం. ఈ విష‌యం నెట్టింట ఆస‌క్తిక‌రంగా మారింది. యంగ్ మేక‌ర్ కి పెళ్లి కుదిరిన సంద‌ర్భంగా..పెళ్లి కాబోతున్న సంద‌ర్భంగా విషెస్ చెబుతున్నారు.

నాని బిజీ షెడ్యూల్ విష‌యానికి వ‌స్తే ఇటీవ‌లే `అంటే సుంద‌రానికి` చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు త్రినాధ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో `ద‌స‌రా` సినిమాలో న‌టిస్తున్నాడు. ఇది సెట్స్ లో ఉంది. ఇంకా నిర్మాత‌గాను బిజీగా ఉన్నారు. `హిట్: ది సెకెండ్ కేస్`..`మీట్ క్యూట్` చిత్రాల్ని నిర్మిస్తున్నారు.