Begin typing your search above and press return to search.

స్టార్ హీరోపై కోర్టుకెక్కిన నిర్మాత.. కోర్టు భారీ షాక్

By:  Tupaki Desk   |   2 April 2022 5:22 AM GMT
స్టార్ హీరోపై కోర్టుకెక్కిన నిర్మాత.. కోర్టు భారీ షాక్
X
వరుస సినిమాలతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ హీరో శివ కార్తికేయన్ ఇప్పుడు తెలుగు వారికి కూడా దగ్గరయ్యారు. తెలుగు-తమిళ బై లింగ్యువల్ సినిమా చేస్తున్న ఆయన మీద ఒక నిర్మాత పిటీషన్ దాఖలు చేయడం సంచలనమైంది. 2019లో శివ కార్తియేయన్ హీరోగా నటించిన ‘మిస్టర్ లోకల్’ అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలై భారీ డిజిస్టార్ గా నిలిచింది. ఈ సినిమాలో నటించడానికి హీరోకు రూ.15 కోట్లు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ పూర్తి రెమ్యూనరేషన్ ను చెల్లించలేదని అభియోగం.

తాజాగా ‘మిస్టర్ లోకల్’ సినిమాను నిర్మించిన నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాపై శివ కార్తికేయన్ మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం నిర్మాత తీస్తున్న రెబల్, చియాన్ 61, పాతు తాలా పేరుతో తెరకెక్కుతున్న ప్రాజెక్టులలో నిర్మాత జ్ఞానవేల్ రాజా పెట్టుబడులు పెట్టకుండా నిరోధించాలని.. ఈ మూడు సినిమాలకు సంబంధించిన థియేట్రికల్ రిలీజ్ లేదా ఆయా సినిమాలకు సంబంధించిన ఎలాంటి హక్కులు అమ్మకుండా నిషేధించాలని శివ కార్తికేయన్ కోర్టును కోరారు.

తన సినిమాకు 15 కోట్లు పారితోషికం ఇస్తామని జులై 6,2018న ఒప్పందం చేసుకొని రూ.11 కోట్లు మాత్రమే చెల్లించారని పిటీషన్ దాఖలు చేశారు. అంతేకాదు ఇచ్చిన రూ.11 కోట్లకు కూడా టీడీఎస్ కట్టలేదని.. రూ.91 లోలు టీడీఎస్ కింద కట్ అయ్యాయని కార్తికేయన్ పేర్కొన్నాడు. నిర్మాత ఆ 11 కోట్లకు టీడీఎస్ కట్టారనుకొని శివ కార్తికేయన్ టాక్స్ చెల్లించక పోయేసరికి పన్ను ఎగవేత చేసినట్లు ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి శివ కార్తికేయన్ కు నోటీసులు రావడంతో అప్పుడు అన్ని చూసుకున్న నిర్మాత ఈ డబ్బులకు టీడీఎస్ కట్టలేదని తెలుసుకున్నారని సమాచారం. అందుకే ఇప్పుడు కోర్టుకు ఎక్కినట్టు సమాచారం.

ఇక హీరో శివకు సైతం మరో దర్శక నిర్మాత షాక్ ఇచ్చారు. కేఈ జ్ఞానవేల్ రాజా కూడా తాను హీరో శివ వల్ల రూ.20 కోట్లు నష్టపోయినట్టు తెలుపుతూ కోర్టుకెళ్లాడు. తనకు మిస్టర్ లోకల్ కథ అసలు నచ్చలేదని.. చెప్పినా వినకుండా తనతో బలవంతంగా సినిమా చేసేలా ఒత్తిడి తీసుకొచ్చాడని జ్ఞానవేల్ రాజా కోర్టు దృష్టికి తెచ్చాడు. అందుకే సినిమాను నిర్మించానని పిటీషన్ లో పేర్కొన్నాడు.

సినిమా విడుదలై ఇన్ని రోజుల తర్వాత కేసు పెట్టడం వెనుక కారణం డబ్బుల లొల్లినే కారణమని తెలుస్తోంది. తాను సినిమా చేసి నష్టపోయినందుకు శివ కార్తికేయన్ కు పెనాల్టీ విధించి తనపై ఉన్న కేసును కొట్టివేయాల్సిందిగా జ్ఞానవేల్ రాజా కోరాడు