Begin typing your search above and press return to search.

నాన్న నా హీరో .. అమ్మ నా గైడ్: సితార

By:  Tupaki Desk   |   2 April 2022 9:05 AM GMT
నాన్న నా హీరో .. అమ్మ నా గైడ్: సితార
X
మహేశ్ బాబుకి మాత్రమే కాదు .. ఆయన కూతురు సితారకి కూడా అభిమానులు ఉన్నారు. మొదటి నుంచి కూడా సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. సితారకి డాన్స్ అంటే ఇష్టమనే విషయం ఆమె వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది. సితార ఫోటోలను .. డాన్సులను ఎప్పటికప్పుడు నమ్రత పోస్ట్ చేస్తూ వచ్చారు. అందువలన సితార డాన్స్ బాగా చేస్తుందనే విషయం అందరికీ అర్థమైపోయింది. నిన్నమొన్నటివరకూ తడబడుతూ .. తప్పటడుగులు వేస్తూ క్యూట్ గా అనిపించిన సితార ఇప్పుడు డాన్సులను దుమ్మురేపేస్తోంది.

ఇటీవల మహేశ్ బాబు సినిమా 'సర్కారువారి పాట' నుంచి వదిలిన 'పెన్నీ' సాంగులో సితార మెరిసింది. రెగ్యులర్ గా వీడియోలలో చూస్తూనే ఉన్నప్పటికీ, అప్పుడే సితార ఇంత ఎదిగిందా? అని అంత ఆశ్చర్యపోయారు. ఈ పాటలో సితార డాన్స్ .. ఆమె ఎక్స్ ప్రెషన్ చూసిన వాళ్లంతా ఇండస్ట్రీకి వస్తే స్టార్ కావడం ఖాయమని చెప్పుకున్నారు. అంత పెర్ఫెక్ట్ గా ఆమె స్టెప్పులు వేసింది. అలాంటి సితార తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది. "అమ్మానాన్నలలో ఎవరు ఇష్టమని అడిగితే, ఇద్దరూ ఇష్టమేనని చెబుతాను.

నా ఫీలింగ్స్ ను ఇద్దరితోను పంచుకుంటాను. అన్నయ్యపై ఫిర్యాదు చేయవలసి వస్తే మాత్రం అమ్మతోనే చెబుతాను. అలా అని చెప్పేసి నేను .. అన్నయ్య కొట్టుకోవడం ఉండదు. ఇద్దరం చాలా సరదాగా ఉంటాము .. ఆటల సమయంలో మాత్రం నేనే తనని కాస్త అల్లరి పెడుతుంటాను. ఆటపాటల విషయంలో మా అమ్మ మమ్మల్ని ఎంతగా ఎంకరేజ్ చేస్తుందో, చదువు విషయానికి వచ్చేసరికి అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది. అమ్మ మా గైడ్ .. మాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు తనే చూసుకుంటుంది. నాన్నకు దాదాపుగా కోపమే రాదు. బాగా చదువుకోమని చెబుతుంటారు.

మొదటి నుంచి కూడా నాకు డాన్స్ అంటే ఇష్టం. 'పెన్నీ' సాంగ్ చేసేటప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. స్క్రీన్ పై బాగా కనిపించనేమో అనుకునే దానిని. ఆ పాటకి .. నా డాన్స్ కి మంచి పేరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అనీ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నాను. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం కలగడానికి కారణం కూడా మా నాన్ననే .. నాన్నే నా హీరో. నాన్నతో కలిసి అప్పుడప్పుడు షూటింగులకు వెళుతూ ఉంటాను. 'మహర్షి' షూటింగు సమయంలోని జ్ఞాపకాలు మనసులో అలా ఉండిపోయాయి. ఖాళీ సమయం మా ఫ్రెండ్స్ తోను .. కుక్కపిల్లలతోను .. వీడియో గేమ్స్ తోను గడిచిపోతుంది" అని చెప్పుకొచ్చింది