Begin typing your search above and press return to search.

దుబాయ్ లో దొర‌సాని మెరుపులు చూశారా?

By:  Tupaki Desk   |   30 March 2022 4:40 AM GMT
దుబాయ్ లో దొర‌సాని మెరుపులు చూశారా?
X
దొర‌సాని చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది న‌ట‌వార‌సురాలు శివాత్మిక రాజశేఖర్. మొదటి సినిమా హిట్ట‌వ్వ‌క‌పోయినా కానీ న‌టిగా ల‌క్ చెక్ చేసుకుంది. ఆ త‌ర్వాత‌ కోలీవుడ్ లో ఆనందం విలాయుదుం వీడు అనే సినిమా చేసింది.

తాజాగా దుబాయ్ నుండి శివాత్మిక కొన్ని ఫోటోల్ని షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారాయి. సింపుల్ డిజైన‌ర్ లుక్ ఇది. నీలిరంగు దుస్తులలో ఎంతో అందంగా క‌నిపిస్తోంది.

శివాత్మిక బ్లూ ఫ్లోరల్ ప్రింట్ దుస్తుల్లో ముగ్ధ‌మ‌నోహ‌రిని త‌ల‌పిస్తోంది. థైస్లిట్ లుక్ అంద‌మైన ఛాయ‌తో మెరిసిపోతోంది. ఈ లుక్ చాలా స్పెష‌ల్. పైగా సమ్మర్ ఫ్యాషన్ అని అర్థ‌మ‌వుతోంది. త‌న చేతికి ఒక ఖరీదైన స్లింగ్ బ్యాగ్ ని జోడించింది మ‌నోహ‌రి.

అస‌లు మేక‌ప్ అనేదే క‌నిపించ‌కుండా ఎంతో నేచుర‌ల్ బ్యూటీలా క‌నిపిస్తోంది. ఆమె గోల్డ్ హోప్ చెవిపోగులు చ‌క్క‌గా కుదిరాయి. ఇక ఉంగ‌రాల జుత్తు చిన్న‌ది సోషల్ మీడియా ఫాలోవర్లను మంత్రముగ్ధులను చేస్తోందంటే అతిశ‌యోక్తి కాదు.

రాజ‌శేఖ‌ర్- జీవిత జంట గారాల పుత్రిక‌లు శివాత్మిక - శివాని ఇద్దరూ టాలీవుడ్ లో ఫ్యాష‌నిస్టాలుగా సుప‌రిచితం. సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు.

సింపుల్ వ‌స్త్ర‌ధార‌ణలోనూ ఎంతో అందంగా క‌నిపిస్తున్నారు ఈ నేటిత‌రం టీనేజీ తార‌లు. మునుముందు కెరీర్ ప‌రంగా పెద్ద‌గా ఎద‌గాల‌ని ఆకాంక్షిద్దాం. న‌ట‌న‌లో వాక్చాతుర్యంలో త‌న మామ్ జీవిత నుంచి టిప్స్ అందుకుని స్టార్ గా ఎద‌గాల‌ని కోరుకుందాం.