Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న‌కు ఇద్ద‌రు క‌లిసి చుక్క‌లు చూపించారుగా

By:  Tupaki Desk   |   22 March 2022 3:59 AM GMT
జ‌క్క‌న్న‌కు ఇద్ద‌రు క‌లిసి చుక్క‌లు చూపించారుగా
X
భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల‌వుతున్న ట్రిపుల్ ఆర్‌ రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ మేక‌ర్స్ హంగామా ఎక్కువైపోతోంది. రిలీజ్ మ‌రో నాలుగు రోజులు వుండ‌టంతో ప్ర‌చార ప‌ర్వం పీక్స్ కి చేరిపోయింది. ఏ మీడియంని వ‌ద‌ల‌కుండా మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్‌ని మోత మోగించేస్తున్నారు. జ‌క్క‌న్న త‌న‌యుడు కార్తికేయ నేతృత్వంలో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. దేశం న‌లుమూల‌ల‌కు వెళ్లి టీమ్ ప్ర‌చారం చేయ‌డం విశేషం. `బాహుబ‌లి` ప్ర‌మోష‌న్స్ ని తారా స్థాయికి తీసుకెళ్లి ఒక సినిమా ప్ర‌మోష‌న్స్ ని ఇలా కూడా చేయొచ్చ‌ని నిరూపించారు రాజ‌మౌళి.

`బాహుబ‌లి` ప్ర‌చార ఫార్మాలాని మించి ట్రిపుల్ ఆర్ కు ప్ర‌చారం మొద‌లుపెట్టారు. ఇప్ప‌టికే ప్ర‌ధాన న‌గ‌రాల్లో భారీ ఈవెంట్ ల‌ని నిర్వ‌హించిన టీమ్ కోల్ క‌తాలో ఈవెంట్ ని నిర్వ‌హించ‌బోతోంది. ఇదిలా వుంటే ఇప్ప‌టికే రికార్డెడ్ ఇంట‌ర్వ్యూల‌ని పూర్తి చేయ‌డంతో ఒక్కొ ఇంట‌ర్వ్యూని విడుద‌ల చేస్తున్నారు. ఇటీవ‌ల ఆఫ్ ది రికార్డ్ అని, కీర‌వాణితో చిట్ చాట్ అని వ‌రుస‌గా ఇంట‌ర్వ్యూల‌ని బ‌య‌టికి వ‌దిలారు. తాజాగా మ‌రో ఇంట‌ర్వ్యూ బ‌య‌టికి వ‌చ్చేసింది.

రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఈ ముగ్గురితో యాంక‌ర్ సుమ అద‌రిపోయే లెవెల్లో ఓ ఇంట‌ర్వ్యూ చేసింది. సోష‌ల్ మీడియాలో ట్రిపుల్ ఆర్ పై ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న‌పై వ‌చ్చిన మీమ్స్ నేప‌థ్యంలో ఈ ఇంట‌ర్వ్యూ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. ఈ ఇంట‌ర్వ్యూలో ముందుగా రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ .. ప్ర‌భాస్ తో నాలుగేళ్లు.. మాతో రెండేళ్లు అంటూ చెప్తుంటే మ‌ధ్య‌లో సుమ అందుకుని `పాపం వీళ్లు రెండేళ్లే అనుకుంటున్నారు అనే మీమ్ చూపించింది.

అంత‌టితో ఆగ‌క గ‌తంలో ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్ లో రాజ‌మౌళి ఖ‌చ్చితంగా 2020లోనే సినిమా రిలీజ్ చేస్తామ‌ని చెప్పిన వీడియోకు ర‌వితేజ - బ్ర‌హ్మానందం నేనింతే వీడియోని ఎడిట్ చేసి మీమ్ వీడియో చూపించింది. సుమ వేసిన పంచ్ కి ముగ్గురు పగ‌ల‌బ‌డి న‌వ్వుకున్నారు. అస‌లు అప్పుడే జ‌క్క‌న్న కు 2021, 2022 అని ఎలా తెలుసు అని తార‌క్ ప్ర‌శ్నించ‌గా.. దానికి సుమ ప్రీవియ‌స్ ఎక్స్‌పీరియ‌న్స్ అని ఆన్స‌ర్ ఇచ్చేసింది. ఆయ‌న గురించి ఆయ‌న‌కు బాగా తెలుసు. రెండు మూడేళ్లు ప‌ట్టొచ్చ‌ని తార‌క్ అన‌డంతో రాజ‌మౌళి తెగ ఫీలైప‌సోయారు.

పోనీ అది చూసైనా సుమ ఆగిందా అబ్బే అస్స‌లు ఆగ‌లేదు.. సుమ‌కు తోడుగా ఎన్టీఆర్ కూడా తోడ‌వ్వ‌డంతో జ‌క్క‌న్న ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎల‌క‌లా త‌యారైంది. పిడిగుద్దుల్లాంటి పంచుల‌తో ఆరు నెల‌ల్లో చేయాల్సిన `ఈగ‌`ని రెండేళ్లు తీశాడ‌ని, ఆరు నెల‌ల్లో తీయాల్సిన మ‌ర్యాద రామ‌న్న ని ప‌ద్దెన‌మిది నెల‌లు తీశాడ‌ని, అక్కీగా అది ఈగ కాబ‌ట్టి రెండేళ్లు ప‌ట్టింద‌ని ఏదో బొద్దింక అయి వుంటే ఇంకా జ‌క్క‌న్న ఎన్నేళ్లు తీసేవాడో అంటే ఎన్టీఆర్‌, సుమ ఓ ర‌కంగా జ‌క్క‌న్న‌కు చుక్క‌లు చూపించినంత ప‌ని చేశారు.