Begin typing your search above and press return to search.

పుష్ప‌రాజ్ మ్యాన‌రిజ‌మ్ దించేసిన విద్యాబాల‌న్!

By:  Tupaki Desk   |   23 March 2022 2:30 PM GMT
పుష్ప‌రాజ్ మ్యాన‌రిజ‌మ్ దించేసిన విద్యాబాల‌న్!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప` ది రైజింగ్ లో శ్రీవ‌ల్లి పాట‌..అందులో హుక్ స్టెప్ వ‌ర‌ల్డ్ వైడ్ ఎంత ఫేమ‌స్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. బ‌న్నీ హుక్ స్టెప్ ని అనుక‌రించిన క్రికెటర్ లేడు...సెల‌బ్రిటీలు లేరు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కూ..ఇండియా నుంచి ఆస్ర్టేలియా వ‌ర‌కూ ప్ర‌పంచ‌మే ఆ సిగ్నెచ‌ర్ స్టెప్ కి ఫిదా అయింది.

టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా.. శిఖర్‌ ధావన్‌.. సురేశ్‌ రైనా.. హార్దిక్‌ పాండ్యా..ర‌వి చంద్ర‌న్ అశ్విన్ తదితరులు త‌మ‌దైన శైలిలో అల‌రించారు. ఇక కామ‌న్ ఆడియ‌న్స్ అయితే వ‌య‌సుతో సంబంధం లేకుండా పిల్లా పిసికి...ముస‌లి ముత‌కా ఇలా ఎవ్వ‌రూ శ్రీవ‌ల్లి పాట‌ని విడిచి పెట్ట‌లేదు. ఎవ‌రి స్టైల్లో వారు స్టెప్పుల్ని రీక్రియేట్ చేసారు.

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ అయితే ఏకంగా రోజుకో వీడియోతో అల‌రించాడు. ఆ రేంజ్ లో శ్రీవ‌ల్లి పాట ఫేమ‌స్ అయింది. తాజాగా ఇప్పుడా వంతు బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ ది అయింది. శ్రీవ‌ల్లి పాట‌లో స్టెప్పుల్ని విద్యాబాల‌న్ త‌న‌దైన శైలిలో రీక్రియేట్ చేసింది. బ‌న్నీ మ్యాన‌రిజ‌మ్ సైతం అనుక‌రించి ఆక‌ట్టుకుంది. న‌ల్ల‌చీర‌..జాకెట్ ధ‌రించి..క‌ళ్ల‌కు మ్యాచింగ్ న‌ల్ల అద్దాలు ధ‌రించి త‌న‌దైన శైలి హావ‌భావాల‌తో ఫిదా చేస్తోంది.

దానికి సంబంధించిన వీడియో ఒక‌టిప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. ఆమె అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ పుష్ప చిత్రం క్రేజ్‌ను మరోసారి వైరల్ చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి 80 ఏళ్ల అనుప‌మ్ ఖేర్ త‌ల్లిని సైతం శ్రీవ‌ల్లి పాట కాలు క‌దిపేలా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ వృద్దురాలు డాన్స్ చేస్తుండ‌గా వీడియో షూట్ చేసి దాన్ని అనుప‌మ్ ట్విట‌ర్లో పోస్ట్ చేసారు. ఆ వీడియోకి మంచి స్పంద‌న ద‌క్కింది. బాలీవుడ్ సెల‌బ్రిటీలంతా అమ్మ ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నారంటూ కామెంట్లు పోస్ట్ చేసారు.

మ‌రి ఇలాంటి అద్భుత‌మైన సాంగ్ ని `పుష్ప ది రూల్` లో సుకుమార్-దేవి శ్రీలు ఏమైనా ప్లాన్ చేసారో చూడాలి. ప్ర‌స్తుతం రెండ‌వ భాగం షూటింగ్ ప‌నుల్లో టీమ్ నిమ‌గ్న‌మైంది. అన్ని ప‌నులు పూర్తిచేసి వీలైనంత త్వ‌ర‌గా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది.