Begin typing your search above and press return to search.

ఒక ర‌కంగా ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ కి రీమేకా పూరీ?

By:  Tupaki Desk   |   5 April 2022 5:35 AM GMT
ఒక ర‌కంగా ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ కి రీమేకా పూరీ?
X
తండ్రి కొడుకుల అనుబంధం లేదా విరోధం నేప‌థ్యంలో చాలా సినిమాలు చూశాం. వీటిలో హిట్లు బంప‌ర్ హిట్లు ఉన్నాయి. తండ్రి కొడుకుల మ‌ధ్య‌ ఎమోష‌న‌ల్ డ్రామాని ర‌క్తి క‌ట్టించ‌గ‌లిగితే హిట్లు కొట్ట‌డం క‌ష్టం కాద‌ని ప‌లువురు నిరూపించారు. ఇంత‌కుముందు పూరి జ‌గ‌న్నాథ్ లాంటి మాస్ డైరెక్ట‌ర్ ఇలాంటి క‌థాంశంతో ప్రూవ్ చేశారు. అత‌డు తెర‌కెక్కించిన `అమ్మా నాన్న త‌మిళ‌మ్మాయి` చిత్రంలో ర‌వితేజ‌కు త‌న తండ్రి ప్ర‌కాష్ రాజ్‌ తో డిఫ‌రెన్సెస్ నేప‌థ్యంలో ఆద్యంతం ఎమోష‌న్ ర‌క్తి క‌ట్టిస్తుంది. పూరీ హీరోయిజాన్ని ప‌రాకాష్ట‌లో ఆవిష్క‌రించారు ఈ చిత్రంలో.

అయితే ఇప్పుడు అదే ఎమోష‌న‌ల్ టింజ్ ని లైగ‌ర్ కి కూడా పూరీ స‌ర్ క‌నెక్ట్ చేశార‌ని గుస‌గుస వినిపిస్తోంది. తండ్రి కొడుకుల మ‌ధ్య ఎమోష‌న‌ల్ డిస్క‌నెక్ష‌న్ అనేది ఇందులో ప్ర‌ధానంగా హైలైట్ గా నిల‌వ‌నుంది. ఇందుకు మైక్ టైస‌న్ .. విజ‌య్ దేవ‌ర‌కొండ సీన్స్ ప్రూఫ్ గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు.

నిజానికి అమ్మా నాన్న త‌మిళ‌మ్మాయి చిత్రంలో స్వ‌దేశీ తండ్రిగా ప్ర‌కాష్ రాజ్ క‌నిపిస్తే.. లైగ‌ర్ లో విదేశీ తండ్రిగా మైక్ టైస‌న్ క‌నిపిస్తారు. విజ‌య్ కి తండ్రిగా టైస‌న్ ఎమోష‌న‌ల్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ట‌. సాలా క్రాస్ బ్రీడ్! అంటూ ట్యాగ్ లైన్ ఇవ్వ‌డం వెన‌క కార‌ణం కూడా ఇదే.

ఇండియ‌న్ మ‌ద‌ర్.. విదేశీ ఫాద‌ర్ కి జ‌న్మించిన‌వాడిగా క‌థానాయ‌కుడి పాత్ర ఉంటుంది. నిజానికి ఈ చిత్రంలో విజ‌య్ కి కోచ్ గా మాత్ర‌మే మైక్ టైస‌న్ క‌నిపిస్తార‌ని అంతా భావించారు. కానీ అంద‌రికీ షాక్ నిస్తూ అత‌డు వీడీకి తండ్రి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని గుస‌గుస వినిపిస్తోంది.

అయితే పూరీ ఆ పాత్ర‌ను ఎలా క‌నెక్ట్ చేశాడు? తెలుగు ఆడియెన్ కి ఎంత క‌నెక్ట‌వుతుంది? అన్నది వేచి చూడాలి. 2022 ఆగ‌స్టులో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ జాబితాలో ఈ చిత్రం కూడా ఉంది. ఇప్ప‌టికే క‌ర‌ణ్ జోహార్ - ఛార్మి బృందాలు ప్ర‌చారం ప‌రంగా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇందులో అన‌న్య పాండే లాంటి హాట్ గాళ్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌డం ప్ల‌స్ కానుంది.