Begin typing your search above and press return to search.

పూజా సౌత్ సినిమాలను చిన్నచూపు చూస్తోందా..?

By:  Tupaki Desk   |   1 April 2022 2:30 AM GMT
పూజా సౌత్ సినిమాలను చిన్నచూపు చూస్తోందా..?
X
'ముగమూడి' (తెలుగులో 'మాస్క్') అనే తమిళ ప్లాప్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన పూజా హెగ్డే.. 'ఒక లైలా కోసం' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో పలు సూపర్ హిట్లు అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయిన పూజా హెగ్డే.. తెలుగుతో పాటుగా తమిళ - హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అయితే ఈ మధ్య కాలంలో అమ్మడి తీరుతో.. ఫేమ్ - స్టార్ డమ్ తెచ్చిపెట్టిన సౌత్ ఇండస్ట్రీపై ఆమెకు గౌరవం లేదా? దక్షిణాది సినిమాలను చిన్న చూపు చూస్తోందా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పూజా హెగ్డే సౌత్ లో వరుసగా సినిమాలు చేస్తోంది కానీ.. ప్రమోషన్స్ లో మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడు బాలీవుడ్ లో డస్కీ బ్యూటీకి ఆఫర్స్ వస్తుండంతో దక్షిణాది సినిమాలను తక్కువగా చూస్తోందని.. అందుకే ప్రచార కార్యక్రమాలకు రావడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. ఆమెపై ఎవరి ప్రభావం పడిందో అని ఆలోచిస్తున్నారు.

అంతేకాదు తన పక్కన నటిస్తున్న హీరోల కంటే తనను ఎక్కువగా పుష్ చేయమని పూజా హెగ్డే స్ట్రాటజిస్ట్‌ లను అడుగుతోందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అమ్మడు సౌత్ సినిమాలను చులకనగా చూస్తోందనే మాటలు వినిపిస్తున్నా.. ఫిలిం మేకర్స్ అందరూ డేట్స్ కోసమే తిరుగుతున్నారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పూజా హెగ్డే లైనప్ చూస్తుంటే ఇంకొన్నాళ్లు ఇండస్ట్రీలో ఆమె హవానే కొనసాగేలా కనిపిస్తోంది. ఇటీవల 'రాధేశ్యామ్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ భామ.. ఏప్రిల్ 29న 'ఆచార్య' మూవీతో రాబోతోంది. ఇందులో ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా కనిపించనుంది.

కోలీవుడ్ హీరో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన 'బీస్ట్' సినిమా ఏప్రిల్ 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. మరి అమ్మడు వచ్చే నెలలో రాబోతున్న ఈ రెండు సినిమాలకు ఎలాంటి షరతులు పెట్టకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటుందో లేదో చూడాలి.

ఇక 'మహర్షి' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో రొమాన్స్ చేసిన పూజా హెగ్డే.. ఇప్పుడు 'SSMB28' చిత్రంతో మరోసారి జత కట్టబోతోంది. ఇది త్రివిక్రమ్ దర్శకత్వంలో బుట్టబొమ్మ చేస్తోన్న ముడో సినిమా. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

అలానే పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలో పూజానే హీరోయిన్ గా తీసుకున్నారు. హిందీలో రణవీర్ సింగ్ - డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబోలో వస్తున్న 'సర్కస్' సినిమాలో నటిస్తోంది. ఇదే క్రమంలో సల్మాన్ ఖాన్ - అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలతో వర్క్ చేయనుందని సమాచారం.