Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ హ‌రి హ‌ర‌ పోస్ట‌ర్..ఫ్యాన్స్ కి కేక‌!

By:  Tupaki Desk   |   10 April 2022 8:30 AM GMT
ప‌వ‌న్ హ‌రి హ‌ర‌ పోస్ట‌ర్..ఫ్యాన్స్ కి కేక‌!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సోషియా ఫాంట‌సీ `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప‌వ‌న్ కి జోడీగా నిధి అగ‌ర్వాలో ఓ హీరోయిన్ గా న‌టిస్తోంది. మ‌రో హీరోయిన్ గా బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ పెర్నాండేజ్ ని తీసుకున్నారు. కానీ ఆమె ఓ మ‌నీస్కామ్ లో ఆరోప‌ణ‌లు ఎదుర్కోవ‌డంతో త‌ప్పించారు. ఇప్పుడా స్థానాని వేరే హీరోయిన్ తో భ‌ర్తీ చేయాల‌ని చూస్తున్నారు. ఇటీవ‌లే సినిమా షూటింగ్ కూడా తిరిగి ప్రారంభ‌మైంది.

భారీ యాక్ష‌న్ షెడ్యూల్ కి యూనిట్ రెడీ అవుతోంది. దీనిలో భాగంగా భారీ సెట్లు నిర్మించిన‌ట్లు స‌మాచారం. కాగా నేడు శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా మేక‌ర్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేసారు. పోస్ట‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. పోస్ట‌ర్ లో ప‌వ‌న్ లో ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ మోడ్ హైలైట్ అవుతుంది. గ్రీన్ క‌ల‌ర్ దుస్తుల‌పై మెడ‌లో సాలువా ధ‌రించి చేతిలోఈటు ప‌ట్టుకుని గంభీర‌మైన చూపు తో శ్ర‌తువు వైపు గురిపెట్టిన‌ట్లు క‌నిపిస్తుంది.

హీరోయిక్ లుక్ లో క్రిష్ ప‌వ‌న్ ని అదిరిపోయే లుక్ లో దించాడ‌ని చెప్పొచ్చు. మునుపెన్న‌డు చూడ‌ని స‌రికొత్త ప‌వ‌న్ ని పోస్ట‌ర్ లో ఆవిష్క‌రించిన‌ట్లు క‌నిపిస్తుంది. ఈ పోస్ట‌ర్ తో ప‌వ‌న్ ఫ్యాన్స్ లో పున‌కాలు ఖాయం. పోస్ట‌ర్ ఈ రేంజ్లో వ‌దిలారంటే టీజ‌ర్..ట్రైల‌ర్ తో ప‌వ‌న్ సునామీ మామూలుగా ఉండ‌దు. చారిత్రాత్మ‌క నేప‌థ్యంతో `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ పై ఏ.ఎం ర‌త్నం స‌మ‌ర్ప‌ణ‌లో భారీ బ‌డ్జెట్ తో నిర్మాణం జ‌రుగుతుంది. ప‌వ‌న్ కెరీర్ లోనే ఇదే తొలి భారీ బ‌డ్జెట్ చిత్రం కావ‌డం విశేషం. ఈ చిత్రానికి ఎం.ఎం కీర‌ణ‌వాణీ సంగీతం అందిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసి ఇదే ఏడాది చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.