Begin typing your search above and press return to search.

టెర్రిఫిక్ మేకోవ‌ర్‌..కొమురం భీముడి కొత్త లుక్ చూశారా?

By:  Tupaki Desk   |   14 April 2022 1:30 PM GMT
టెర్రిఫిక్ మేకోవ‌ర్‌..కొమురం భీముడి కొత్త లుక్ చూశారా?
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ `ట్రిపుల్ ఆర్` ఇటీవ‌ల విడుద‌లై దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యాన్ని సాధిస్తూ రికార్డులు తిర‌గ‌రాస్తోంది. ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ మూవీ కోసం ప్రేక్ష‌కులు, అభిమానులు దాదాపు మూడున్న‌రేళ్ల పాటు ఎదురుచూశారు. దీంతో ఈ మూవీపై స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినిమా కూడా అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో వుండ‌టంతో స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల‌తో పాటు రికార్డు స్థాయి వ‌సూళ్లు కూడా ల‌భిస్తున్నాయి.

ఇప్ప‌టికే ప‌లు క్రేజీ చిత్రాల రికార్డుల్ని తిర‌గ‌రాసిన ఈ చిత్రం ఇటీవ‌ల 1000 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయింది. రానున్న రోజుల్లో మ‌రిన్ని రికార్డుల్ని ఈ మూవీ తిరిగ‌రాయ‌డం ఖాయం అంటూ ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదిలా వుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆయ‌న నుంచి బ్రేకింగ్ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. `ట్రిపుల్ ఆర్` రిలీజ్ త‌రువాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వెంట‌నే మ‌రో ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించి రాకెట్ స్పీడుతో పూర్తి చేస్తున్నాడు.

శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే మా హీరో ఎన్టీఆర్ ఇంకా త‌న 30వ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్ డేట్ ఇవ్వ‌డంలేదేంట‌ని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ప్ర‌క‌టించి దాదాపు ఏడాది పైనే అవుతున్నా ఇప్ప‌టికీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్ డేట్ ని విడుద‌ల చేయ‌లేదు. దీంతో ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా వున్నార‌ట‌. ఎన్టీఆర్ మాత్రం త‌న త‌దుప‌రి చిత్రం కోసం అప్పుడే క‌స‌రత్తులు చేయ‌డం మొద‌లుపెట్టాడు.

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల డైరెక్ష‌న్ లో ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రాన్ని యువ సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై మిక్కినేని సుధాక‌ర్ నిర్మించ‌బోతున్నారు. జూన్ నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దీంతో ఈ మూవీ షూటింగ్ కి స‌రిగ్గా రెండు నెల ల స‌మ‌యం వుండ‌టంతో ఎన్టీఆర్ ఈ మూవీ కోసం ప్ర‌త్యేకంగా 8 కేజీలు త‌గ్గ‌డం మొద‌లు పెట్టారు.

ఇప్ప‌టికే ప్ర‌త్యేక ట్రైన‌ర్ స‌హాయం తో బ‌రువు త‌గ్గ‌డం మొద‌లు పెట్టిన ఎన్టీఆర్ టెర్రిఫిక్ మేకోవ‌ర్ లోకి ట్రాన్స్ ఫార్మ్‌ అయిపోయాడు. ట్రైన‌ర్ తో క‌లిసి పంచుకున్న ఎన్టీఆర్ ఫొటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారి ఫ్యాన్స్ ని వావ్ అనిపించేస్తోంది. బ‌రువు త‌గ్గి మీసం, గ‌డ్డం ట్రిమ్ చేసి ఎన్టీఆర్ టెర్రిఫిక్ లుక్ లోకి మారిన తీరు ఫ్యాన్స్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ట్రిపుల్ ఆర్ టైమ్ లో ర‌ఫ్ లుక్ లో క‌నిపించిన ఎన్టీఆర్ ప్ర‌స్తుతం స‌రికొత్త మేకోవ‌ర్ లోకి మారిపోవ‌డం విశేషం. ఎన్టీఆర్ కు సంబంధించిన న్యూ లుక్ ఫొటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.