Begin typing your search above and press return to search.
బాలీవుడ్ లో చెర్రీ అలా తారక్ ఇలా
By: Tupaki Desk | 31 March 2022 9:30 AM GMTRRR ఘనవిజయం నేపథ్యంలో రామ్ చరణ్ .. రామారావు ఇద్దరికీ బాలీవుడ్ నుంచి పలు క్రేజీ ఆఫర్లు దక్కాయని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంత? అన్నది మాత్రం ధృవీకరించాల్సింది సదరు స్టార్లు మాత్రమే.
రామ్ చరణ్ ప్రముఖ బాలీవుడ్ బ్యానర్ లో నటించేందుకు ఇప్పటికే సంతకం చేసేశారని కూడా ఇటీవల కథనాలొచ్చాయి. ఇప్పుడు తారక్ తన బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీనిచ్చేశారంటూ ప్రచారం సాగుతోంది.
RRR ఇప్పటికే పలు చిత్ర పరిశ్రమలలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. వెండితెరపై జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల మాయాజాలం అసాధారణంగా వర్కవుటైంది. దేశవ్యాప్తంగా ఆ ఇద్దరి కీర్తి పెరుగుతోంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కి బాలీవుడ్ సినిమాలో నటించే ఆలోచన ఉందా? అని అడిగితే..తారక్ జవాబిచ్చారు. వాస్తవానికి తాను `సరైన హిందీ చిత్రం`లో నటించాలనుకుంటున్నాను.. అంటూ ప్రముఖ జాతీయ మీడియాకి మనసులో మాట చెప్పేశాడు.
ఇటీవల ఓ చాటింగ్ సెషన్ లో ``మీరు బాలీవుడ్ చిత్రంలో నటించాలనుకుంటున్నారా?`` అని అడిగారు. దానికి తారక్ ఇలా బదులిచ్చారు. ``నేను సరైన హిందీ చిత్రంలో పనిచేయడానికి ఇష్టపడతాను. భాషలు భిన్నంగా ఉంటాయి కానీ ప్రధాన భావోద్వేగం డ్రామా ఎప్పుడూ మారవు. మార్పులు చిన్నగానే ఉంటాయి`` అని అన్నారు. మీకు ఇష్టమైన దర్శకులు ఎవరు? అని ప్రశ్నిస్తే... తడుముకోకుండా రాజ్ కుమార్ హిరాణీ -సంజయ్ లీలా భన్సాలీ పేర్లను రివీల్ చేశాడు. చాలా మంది ఉన్నారు.. కానీ నాకు రాజ్ కుమార్ హిరాణీ సర్ సినిమాలంటే ఇష్టం. మనల్ని అద్దం ముందు నిలబెట్టే సినిమాలు తీశారు ఆయన. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. బలమైన పాత్రలున్నాయి. అతను సినిమాలు తీసే విధానం... అద్భుతమైన భారీతనం నిండిన కాన్వాస్ అతడి ప్రత్యేకత. ఆయన సినిమాలు కూడా నాకు చాలా ఇష్టం`` అని అన్నారు.
RRR గురించి మాట్లాడుతూ.. ఈ విజయానికి చాలా సంతోషంగా ఉందని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో పాటు ఈ చిత్రంలో అలియా భట్- అజయ్ దేవగన్ - శ్రియా శరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. RRR ప్రారంభ వారాంతంలో కేవలం రూ. 350 కోట్లు వసూలు చేసింది. S.S రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ జూనియర్ నటించిన పీరియాడికల్ యాక్షన్-డ్రామా రూ. బాహుబలి: ది కన్ క్లూజన్ (రూ. 358.20 కోట్లు) తర్వాత.. భారతీయ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ ఆల్ టైమ్ లో రెండవ అతిపెద్ద ఆరంభ వసూళ్లను నమోదు చేసింది. కేవలం మొదటి మూడు రోజుల్లో సుమారు 348 కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ లో 750కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.