Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ రామాయ‌ణం @ 25

By:  Tupaki Desk   |   11 April 2022 6:33 AM GMT
ఎన్టీఆర్ రామాయ‌ణం @ 25
X
మ‌న పూరాన ఇతిహాసాల‌ని ఏ రూపంలో తీసినా వాటికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన సంద‌ర్భాలు చాలానే వున్నాయి. మ‌హా భారతాన్ని `బాల భార‌తం`గా చైల్డ్ ఆర్టిస్ట్ ల‌తో 1972 లో ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు తెర‌కెక్కించారు. ఎస్వీ రంగారావు, అంజ‌లీ దేవి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించి ఈ చిత్రంలో అతిలోక‌సుంద‌రి శ్రీ‌దేవి బాల‌న‌టిగా న‌టించి అల‌రించింది. శ్రీ‌దేవి తో పాటు ఇందులో అంతా బాల‌న‌టులే న‌టించారు. అప్ప‌ట్లో మ‌హా భార‌తం నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం సంచ‌ల‌నంగా నిలిచి ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ చిత్రాల్లో ఒక‌టిగా ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంది. ఇదే ఫార్ములాతో స్టార్ డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ `రామాయ‌ణం`ని తెర‌పైకి తీసుకొచ్చారు.

అంతా బాల‌న‌టుల‌తో రూపొందించిన ఈ మైథ‌లాజీక‌ల్ మూవీని ఎం.ఎస్‌. రెడ్డి అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ సినిమా ద్వారానే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాల‌న‌టుడిగా తెరంగేట్రం చేశారు. ఈ మూవీ విడుద‌లై స‌రిగ్గా నేటికి 25 ఏళ్లు పూర్తి కావ‌స్తోంది. న‌టుడిగా ఎన్టీఆర్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుండ‌టం విశేషం. 1996 ఏప్రిల్ 11న సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఈ మూవీ విడుద‌లైంది. ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచే అన్ని వ‌ర్గాల్లోనూ ఈ మూవీపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. యంగ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ రాముడిగా న‌టించిన ఈ చిత్రంలో సీతాదేవిగా ఎలాంటి సినీ నేప‌థ్యం లేని స్మితా మాధ‌వ్ న‌టించింది.

ఈ చిత్రంలో దాదాపు 3000 మంది చైల్ట్ ఆర్టిస్ట్ లు న‌టించారు. అంతా 10 నుంచి 12 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు వున్న వారే కావ‌డం విశేషం. అయితే ఎన్టీఆర్ వ‌య‌సు అప్పుడు 13 ఏళ్లు. ఆ వ‌య‌సులోనే తొలి చిత్ర‌మైనా రాముడిగా అద్భుతాభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అబ్బుర‌ప‌రిచారు. ఈ వ‌య‌సులోనే ఎన్టీఆర్ డైలాగ్‌లు, ప‌ద్యాలు చెప్ప‌డం ప్ర‌తీ ఒక్క‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఎన్టీఆర్ న‌ట‌న‌ని చూసిన వారంతా తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డు అంటూ ఎన్టీఆర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఎప్ప‌టికైనా గొప్ప‌న‌టుడు అవుతాడ‌ని కొనియాడారు. అన్న‌ట్టుగానే ఎన్టీఆర్ ఇప్ప‌డు ఇండ‌స్ట్రీలో వున్న స్టార్ హీరోల్లో ఒక‌డిగా వెలుగొందుతున్నారు. ఇక `రామాయ‌ణం` అంతా చిన్న పిల్ల‌ల‌తో చేసిన ప్ర‌యోగాత్మ‌కంగా చిత్రంగా నిలిచింది. అంతే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్త‌మ బాల‌ల చిత్రంగా నిలిచి జాతీయ పుర‌స్కారాన్ని సొంతం చేసుకుంది.

రివ్యూస్ ప‌రంగా కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అప్ప‌ట్లోనే దాదాపుగా 5 కోట్ల వ‌ర‌కు షేర్ ని రాబ‌ట్టి చ‌ర్చ‌నీయాంశంగా నిలిచింది. తాత నంద‌మూరి తారాక రామారావు న‌ట వార‌స‌త్వాన్ని పునికి పుచ్చుకున్న వార‌సుడిగా ఎన్టీఆర్ త‌న తొలి చిత్ర‌మైన ఈ మైథ‌లాజిక‌ల్ డ్రామాతో త‌న స‌త్తా ఏంటో చూపించి న‌టుడిగా త‌నేంటో ప్ర‌పంచానికి చాటి చెప్పారు. న‌టుడిగా ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభించి నేటితో 25 ఏళ్ల‌వుతున్న నేప‌థ్యంలో ఆయ‌న అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఎన్టీఆర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నాయి.

రీసెంట్ గా ఎన్టీఆర్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి న‌టించిన‌ పాన్ ఇండియా మూవీ `ట్రిపుల్ ఆర్‌` తో ప్రేక్ష‌కుల ముందు కొచ్చిన విష‌యం తెలిసిందే. మార్చి 25న విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు రికార్డుల్ని తిరగ‌రాసిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 1000 కోట్ల మార్కుని దాటి రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతుండ‌టం విశేషం. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మాయినికి గురిచేస్తోంది. రానున్న రోజుల్లో ఈ మూవీ మ‌రిన్ని రికార్డుల్ని అధిగ‌మించ‌డం ఖాయం అని చెబుతున్నారు.