Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ కండీషన్ సరే... కొరటాల ఒప్పుకున్నాడా?

By:  Tupaki Desk   |   7 April 2022 11:41 AM GMT
ఎన్టీఆర్‌ కండీషన్ సరే... కొరటాల ఒప్పుకున్నాడా?
X
మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాను వంద రోజుల కంటే తక్కువ రోజుల్లోనే పూర్తి చేస్తానని.. 99 రోజుల్లోనే ఆచార్యను పూర్తి చేస్తానంటూ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ స్టేజ్ పై చిరంజీవితో కొరటాల శివ అన్నాడు. ఆ విషయం ను మెగా అభిమానులు అంత సులభంగా మర్చిపోరు. చిరంజీవితో మూడు నెలల్లోనే సినిమాను చేస్తానంటూ కొరటాల శివ చెప్పడంతో ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేశారు.

కొరటాల ఖచ్చితంగా అన్న టైమ్‌ కు ఆచార్య ను పూర్తి చేసేవాడు. కాని కరోనా వచ్చి ఆ మూడు నెలలు కాస్త మూడు సంవత్సరాలు అయ్యేలా చేసింది. ఇప్పటి వరకు కూడా ఇంకా ఆచార్య సినిమా రాలేదు. అందులో పూర్తి బాధ్యత ఆచార్య మేకర్స్ ది కానే కాదు. అది కేవలం కరోనా వల్లే అనడంలో సందేహం లేదు. చిరంజీవి తో మూడు నెలల్లో సినిమాను చేస్తానంటూ అప్పుడు కొరటాల శివ ప్రకటించగా ఇప్పుడు ఎన్టీఆర్‌ కోసం కేవలం 70 నుండి 75 రోజుల్లోనే సినిమా చేయాల్సి వచ్చిందట.

ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కోసం దాదాపుగా నాలుగు సంవత్సరాలు కేటాయించిన ఎన్టీఆర్‌ తదుపరి సినిమా విషయంలో అస్సలు టైమ్ వేస్ట్‌ చేయకూడదని భావిస్తున్నాడట. అందుకే కేవలం 70 వర్కింగ్ డేస్ లోనే సినిమా ను పూర్తి చేయాల్సిందే అంటూ కొరటాల శివకు ఆర్డర్ వేశాడని తెలుస్తోంది. వీరిద్దరి మద్య మంచి సన్నిహిత్యం ఉంది. ఇద్దరి వర్కింగ్‌ స్టైల్‌ ఒకరికి ఒకరు తెలుసు. కనుక ఖచ్చితంగా ఆ డెడ్‌ లైన్ లో పూర్తి చేయడం కన్ఫర్మ్‌.

ఎన్టీఆర్‌ కండీషన్‌ పెట్టాడు సరే.. కొరటాల శివ అందుకు సిద్దమా అంటూ కొందర ఉనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ సహజంగానే తన సినిమాలను చాలా తక్కువ డేట్ల లో పూర్తి చేయాలని భావిస్తూ ఉంటాడు. స్టార్‌ హీరోల డేట్ల ఇష్యూ కారణంగా ఆలస్యం అవుతాయి తప్ప.. ఆయనకు సరిగ్గా సమయంకు అందరు ఉంటే తక్కువ సమయంలోనే సినిమాలను పూర్తి చేస్తాడు.

కనుక ఎన్టీఆర్‌ కండీషన్ కు కొరటాల శివ సిద్దం అయ్యి ఉంటాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమా విడుదల పనుల్లో నిమగ్నం అయ్యి ఉన్నాడు. ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆచార్య సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటాడు. సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్‌ 30 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ షురూ అవుతుంది.

కేవలం నెల రోజుల్లోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను ముగించేసి అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూన్‌ లోనే సినిమాను పట్టాలెక్కించి వెంటనే సినిమాను ముగించాలని భావిస్తున్నాడు. కరోనా వల్ల ఆచార్య సినిమా పై ఏకంగా మూడు సంవత్సరాల సమయం కేటాయించాల్సి వచ్చింది. అందుకే కొరటాల శివ స్పీడ్‌ పెంచి ఎన్టీఆర్‌ 30 ని ఈ ఏడాది లోనే ముగించి.. కొత్త సినిమాను కూడా ఇదే ఏడాదిలో మొదలు పెట్టాలని భావిస్తున్నాడట. కనుక ఎన్టీఆర్‌ 30 సినిమా జెట్‌ స్పీడ్‌ తో ముగిస్తారేమో చూడాలి.