Begin typing your search above and press return to search.

సుమ అంటే ఎన్టీఆర్ మ‌న‌సులో ఇంత వుందా?

By:  Tupaki Desk   |   21 March 2022 7:41 AM GMT
సుమ అంటే ఎన్టీఆర్ మ‌న‌సులో ఇంత వుందా?
X
కేంద్రప్రభుత్వంపై యుద్ధమనేది పెద్ద జోక్ గా తయీరైపోయింది. కేసీయార్ మాటిమాటికి యుద్ధమని ప్రకటించటం, ఢిల్లీకి వెళ్ళి ఒంగి ఒంగి నమస్కారాలు పెట్టివస్తుండటంతో జనాలు నవ్వుకుంటున్నారు. ఇపుడిదంతా ఎందుకంటే తాజాగా యాసంగి ధాన్యాన్ని కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధమంటు కేసీయార్ పిలుపిచ్చారు. పంజాబ్ తరహాలో ఎఫ్సీఐ ద్వారా పండిన ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగులో చేయించాల్సిందే అని కేసీయార్ డిమాండ్ చేస్తున్నారు.

ఇదే విషయమై గతంలో కూడా కేసీయార్ పెద్ద సీనే క్రియేట్ చేశారు. బాయిల్డ్ రైస్ ను ఎఫ్సీఐ ద్వారా కేంద్రమే కొనుగోలు చేయాలని నానా గోల చేశారు. అప్పట్లో కూడా పంజాబ్ నే ఉదాహరణగా కేసీయార్ చూపించారు. అయితే కేంద్రం మాట్లాడుతు పంజాబ్ లో బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయలేదని కేవలం రా రైస్ మాత్రమే కొన్నట్లు ఆధారాలను కూడా చూపించింది. తెలంగాణా మాత్రమే కాదు యావత్ దేశం మొత్తంమీద రా రైస్ మాత్రమే కొనుగోలు చేయాలనే పాలసీ డెసిషన్ తీసుకున్నట్లు స్పష్టంగా చెప్పింది.

ఇప్పటికే కొనుగోలు చేసిన బాయిల్డ్ రైస్ లక్షల టన్నులు తమవద్ద పేరుకుపోయున్న విషయాన్ని కూడా కేంద్రం లెక్కలతో సహా ప్రకటించింది. కాబట్టి ఇకనుండి బాయిల్డ్ రైస్ కొనదలచుకోలేదన్న విషయాన్ని పదే పదే చెప్పింతి. రా రైస్ సరఫరా చేస్తే ఎంతైనా కొంటామని కూడా కేంద్రం చెప్పింది. అయితే కేసీయార్ మాత్రం బాయిల్డ్ రైస్ ను కేంద్రం కొనాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై అప్పట్లో కూడా కేసీయార్ పెద్ద గొడవే చేసి నాలుగు రోజులు ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నారు.

ఢిల్లీలో ఏమైందో ఏమో ఎవరినీ కలవకుండానే హైదరాబాద్ కు తిరిగొచ్చేశారు. అలాంటిది కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఇపుడు బాయిల్డ్ రైసని, పంజాబని గోల మొదలుపెట్టారు. ఢిల్లీవెళ్ళి ప్రధానమంత్రితో పాటు కేంద్రమంత్రులందరినీ కలిసేందుకు అపాయిట్మెంట్ కూడా కోరారు. ఇదంతా చూస్తుంటే కేసీయార్ ఏమన్నా ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రైతులను ఏదో పద్దతిలో రెచ్చగొట్టి కేంద్రానికి వ్యతిరేకంగా ఏకంచేసి లబ్దిపొందాలన్నదే కేసీయార్ ఆలోచనగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఢిల్లీ టూరులో కేసీయార్ ఏమి సాధిస్తారో చూడాల్సిందే.