Begin typing your search above and press return to search.

మిల్క్ బ్యూటీ ఫుల్ సాంగ్ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   24 March 2022 6:59 AM GMT
మిల్క్ బ్యూటీ ఫుల్ సాంగ్ వ‌చ్చేసింది
X
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న బాక్సింగ్‌ డ్రామా `గ‌ని`. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యాన‌ర్స్ పై సిద్దు ముద్ద‌, అల్లు బాబీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా న‌టించింది. కీల‌క పాత్ర‌ల్లో క‌న్న‌డ హీరో ఉపేంద్ర‌, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి న‌టిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్ గా న‌టించిన ఈ చిత్రం ద్వారా కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసిన ఈ మూవీని ఏప్రిల్ 8న విడుద‌ల చేస్తున్న‌ట్టుగా చిత్ర బృందం ఇటీవ‌లే అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇదిలా వుంటే రిలీజ్ కి టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్రం బృందం ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని స్పీడ‌ప్ చేసింది. వ‌రుణ్ తేజ్ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని తెర‌కెక్కించారు. దాదాపు వారం రోజుల క్రితం ఈ చిత్రం ట్రైల‌ర్ ని విడుద‌ల చేయ‌డం తో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌త్యేక గీతంలో మెరిసింది. బాక్సింగ్ రింగ్ లో త‌మ‌న్నా పై చిత్రీక‌రించిన ప్ర‌త్యేక గీతం ఈ మూవీకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు ప్ర‌త్యేక గీతాల్లో మెరిసిన త‌మ‌న్నా `గ‌ని` చిత్రంలో మ‌రింత కొత్త‌గా ఆక‌ట్టుకునే ప్ర‌య‌మ‌త్నం చేసింది. `కొడితే..` అంటూ త‌మ‌న్నాపై చిత్రీక‌రించిన ప్ర‌త్యేక గీతానికి సంబంధించిన ఫుల్‌ వీడియోని మేక‌ర్స్ గురువారం విడుద‌ల చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన లిరిక‌ల్ వీడియోకు మంచి ఆఆద‌ర‌ణ ల‌భించ‌డంతో తాజాగా ఫుల్ వీడియోని విడుద‌ల చేశారు. ఎప్ప‌టి లాగే ఈ పాట‌లో త‌మ‌న్నా త‌మ గ్లామ‌ర్ తో మెరుపులు మెరిపించింది. సీనియ‌ర్ గేయ‌ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన ఈ పాట‌కు త‌మ‌న్ స్వ‌రాలు అందించ‌గా హారికా నారాయ‌ణ్ ఆల‌పించింది. బాక్సింగ నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రంపై వ‌రుణ్ తేజ్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. గ‌త చిత్రాల‌తో పోలిస్తే ఈమూవీ కోసం చాలా క‌ఠోరంగా శ్ర‌మించారు. రియ‌ల్ బాక్స‌ర్ గా క‌నిపించ‌డం కోసం ఫుల్ విష‌యంలోనూ డైట్ ని ఫాలో అవుతూ సినిమా కోసం శ్ర‌మించారు.

ఆ కార‌ణంగానే ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నార‌ట వ‌రుణ్ తేజ్‌. త‌ల్లికిచ్చిన మాట‌ని త‌న ల‌క్ష్యం కోసం త‌ప్పిన ఓ యువ‌కుడు చివ‌రికి త‌న ల‌క్ష్యాన్ని సాధించాడా? బాక్స‌ర్ గా నేష‌న‌ల్ చాంపియ‌న్ షిప్ ని ద‌క్కించుకున్నాడా? అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థాంశం. జ‌గ‌ప‌తిబాబు, న‌వీన్ చంద్ర‌, న‌దియా, న‌రేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.