Begin typing your search above and press return to search.

హాలీవుడ్ గురించి తెలియ‌ద‌నేశాడు!

By:  Tupaki Desk   |   7 April 2022 5:19 AM GMT
హాలీవుడ్ గురించి తెలియ‌ద‌నేశాడు!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం `సర్కారువారి పాట` విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక సినిమా విడుదలకు ముందే విదేశాల్లో హాలిడేకి వెళ్లనున్నాడు. వెకేష‌న్ తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో తన తదుపరి చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. తర్వాత 2023లో లేదా 2022 చివర్లో రాజమౌళి సినిమా సెట్స్ లో జాయిన్ అవుతాడని స‌మాచారం.

అయితే రాజ‌మౌళితో సినిమా సంగ‌తి అటుంచితే మ‌హేష్ హాలీవుడ్ లో ఓ సినిమాకి క‌మిట‌య్యాడ‌న్న టాక్ వైర‌ల్ గా స్ప్రెడ్ అవుతోంది. దానిని మ‌హేష్ ఇన్నిరోజులు ఖండించ‌లేదు. ఓకే అన‌లేదు.

దీంతో అది ఇంకా ఎక్కువ వైర‌ల్ గా మారుతోంది. అయ‌తే తాజాగా ఓ మీడియా ఇంట‌రాక్ష‌న్ లో తానకు ఎలాంటి హాలీవుడ్ మూవీ గురించి తెలియ‌ద‌ని క్లారిటీనిచ్చారు. తాను రాజ‌మౌళితో మాత్ర‌మే సినిమా చేస్తున్నాన‌ని అన్నారు. కానీ దాని గురించి ఎక్కువ మాట్లాడేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌లేదు.

ఓ ప్ర‌యివేట్ ఈవెంట్లో దీనిపై మ‌హేష్ క్లారిటీనిచ్చారు. రాజమౌళి సినిమా చేయడానికి సమయం ఉందని మాత్రం క్లారిటీనిచ్చారు. నిజానికి మ‌హేష్ - రాజ‌మౌళి కాంబినేష‌న్ మూవీ హాలీవుడ్ రేంజు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మ‌హేష్ లాంటి ఛ‌రిష్మాటిక్ స్మార్ట్ హీరోతో సినిమా చేస్తున్నాడు అంటే రాజ‌మౌళి ఏ రేంజులో కాన్సెప్టును ఎంచుకుంటారో అంచ‌నా వేయొచ్చు.

ఇది భార‌త‌దేశంలోనే కాదు హాలీవుడ్ లోనూ రీచబిలిటీతో దూసుకెళుతుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. మ‌హేష్ తో మూవీ కోసం అత్యంత భారీ బ‌డ్జెట్ ని వెచ్య‌చించ‌నున్నార‌న్న టాక్ కూడా ఇన్ సైడ్ వినిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ స‌క్సెస్ అనంత‌రం రాజ‌మౌళి పూర్తిగా దీనిపైనే దృష్టి సారించారు