Begin typing your search above and press return to search.

'ఎఫ్-3' లో ఐట‌మ్ భామ ఎవ‌రంటే?

By:  Tupaki Desk   |   10 April 2022 7:29 AM GMT
ఎఫ్-3 లో ఐట‌మ్ భామ ఎవ‌రంటే?
X
విక్ట‌రీ వెంక‌టేష్‌-మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కులుగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఎఫ్ -3` తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. `ఎఫ్‌-2` కి సీక్వెల్ గా తెర‌కెక్కుతోన్న హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్ టైన్ పై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే ఈ సీక్వెల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. వ‌రుణ్‌-వెంకీల‌కు జోడీగా సీక్వెల్ లోనూ త‌మ‌న్నా..మెహ‌రీన్ ని కొన‌సాగిస్తున్నారు. కామెడీ లో పంచ్ టైమింగ్ ఏమాత్రం మిస్ కాకుండా ఉండాలనే పాత కాబినేష‌న్స్ నే సీక్వెల్ లోనూ కొన‌సాగిస్తున్నారు.

చాలా వ‌ర‌కూ మొద‌ట‌లి భాగంలో ఉన్న పాత్రలు సీక్వెల్ లోనూ క‌నిపిస్తున్నాయి. అవ‌సరం మేర కొన్ని కొత్త పాత్ర‌ల్ని తీసుకున్నారు. వాస్త‌వానికి `ఎఫ్ 2` లో చాలా పాత్ర‌లు ఉంటాయి. అన్ని ఫ‌న్ తో కూడిన పాత్ర‌లే. మ‌రి `ఎఫ్ -3` లో పాత్ర‌ల ఫ‌ర‌ది ఎలా ఉంటుంది? అన్న‌ది తెలియాలి. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

అయితే ఈ సినిమాలో ఐటం గాళ్ ఎవ‌రు? అన్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ముందుగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేని మేక‌ర్స్ అప్రోచ్ అయినట్లు స‌మాచారం. ఆమె ఏకంగా ఒక పాట స‌హా..చిన్న గెస్ట్ అప్పిరియ‌న్స్ కి 3 కోట్లు డిమాండ్ చేసింద‌ని స‌మాచారం. మ‌రి అంత మొత్తం చెల్లించి లాక్ చేసారా? లేక అమ్మ‌డిని లైట్ తీసుకున్నారా? అన్న‌ది తెలియాల్సిన అంశం.

రెమ్యున‌రేష‌న్ విష‌యంలో పూజాహెగ్డే రూపాయి కూడా త‌గ్గ‌దు. ఆమె డిమాండ్ చేసినంత నిర్మాత‌లు ఇవ్వాల్సిందే. ప్ర‌స్తుతం పూజా ఫుల్ స్వింగ్లో ఉంది. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. ఇటీవ‌లే ఓ వేడుక‌లో దిల్ రాజు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఆ వేదిక‌పై పూజా గ‌తంలో ఎప్పుడు చూపించ‌ని ఉత్సాహాన్ని చూపించింది. మ‌రి ఒక వేళ పూజాహెగ్డే కాక‌పోతే `ఎఫ్-3` మేక‌ర్స్ లో మ‌రో స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న ఉంద‌న్న‌ది స‌మాచారం.

పూజాహెగ్డే ఆకాశానికి ఎక్కితే ప్లాన్ బీగా ర‌ష్మిక‌ని సీన్ లోకి దించి ఉంటార‌ని టాక్ వినిపిస్తోంది. ర‌ష్మిక కూడా భారీగానే ఛార్జ్ చేస్తోంది. అయితే ర‌ష్మిక ఐటం పాట‌ల్లో న‌టించ‌డానికి ఒప్పుకుంటుందా? అన్న‌ది పెద్ద సందేహ‌మే. న‌టిగా వ‌చ్చిన ఎన్నో అవ‌కాశాల్నే వ‌దులుకుంది.

పారితోషికం భారీగా ఆఫ‌ర్ చేసినా పాత్ర న‌చ్చ‌క‌పోవ‌డం స‌హా డీ గ్లామ‌ర్ రోల్స్ కార‌ణంగా కోట్ల రూపాయాల్నే కాల‌ద‌న్నంది. అలాంటి బ్యూటీ ఐటం పాట‌లో న‌ర్తించ‌డానికి ఒప్పుకుంటుందా? అన్న‌ది ఆలోచించాల్సిన విష‌యం. మ‌రి ఇద్ద‌రిలో `ఎఫ్-3` లో ఐటం భామ ఎవ‌రు? అన్న‌ది రిలీజ్ వ‌ర‌కూ గాని తెలియ‌దు. ఇప్ప‌టికే ఈ విష‌యంపై యూనిట్ స‌భ్యులు కూడా ఎక్క‌డా డిస్క‌స్ చేయ‌లేదు.