Begin typing your search above and press return to search.

నియర్ శ్రీదేవి మరో సినిమాకు కమిట్‌ అయ్యింది.. ఇక్కడ ఎప్పుడో!

By:  Tupaki Desk   |   30 March 2022 3:30 PM GMT
నియర్ శ్రీదేవి మరో సినిమాకు కమిట్‌ అయ్యింది.. ఇక్కడ ఎప్పుడో!
X
అతిలోక సుందరి శ్రీదేవి సౌత్ తో పాటు నార్త్‌ లో కూడా స్టార్ హీరోయిన్‌ ఇమేజ్ ను సొంతం చేసుకుని సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె నట వారసురాలిగా జాన్వీ కపూర్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. శ్రీదేవి బతికి ఉన్న సమయంలోనే జాన్వీ మొదటి సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినా విడుదల అవ్వడం మాత్రం శ్రీదేవి చనిపోయిన తర్వాత అయిన విషయం తెల్సిందే.

శ్రీదేవి కూతురు అవ్వడంతో కెరీర్‌ మొదట్లో జాన్వీ కపూర్ కు మంచి ఆధరణ దక్కింది. ఆమె సినిమాలు కమర్షియల్‌ గా ప్లాప్ అయినా కూడా నటన కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్దం అవుతున్నాయి. నటిగా తనను తాను నిరూపించుకున్న జాన్వీ కపూర్‌ ఇక రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల జోరు చూపించేందుకు సిద్దం అయ్యింది.

తాజాగా ఈ అమ్మడు వరుణ్ దావన్ హీరోగా నితీష్ తివారి తెరకెక్కించబోతున్న బవాల్‌ అనే సినిమా లో హీరోయిన్‌ గా ఎంపిక అయ్యింది. త్వరలోనే సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అవ్వబోతున్నాయి. వరుణ్ దావన్ మరియు జాన్వీకపూర్‌ లపై ఇప్పటికే టెస్ట్‌ షూట్ జరిగినట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం కాకుండానే 2023 ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా ఎప్పుడెప్పుడు సౌత్‌ లో అడుగు పెడుతుందా అంటూ తెలుగు మరియు తమిళ సినీ అభిమానులు మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ హీరోగా నటించబోతున్న ఒక సినిమా లో జాన్వీ కపూర్‌ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న బవాల్‌ సినిమా తో జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ లో మరింతగా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. దాంతో తెలుగు మరియు తమిళంలో ఈమె సినిమాలు మరింతగా ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ కపూర్‌ 2023 సంవత్సరంలో అయినా సౌత్‌ ఎంట్రీ ఉంటుందా అనేది చూడాలి.