Begin typing your search above and press return to search.

#RRR : రూమ‌ర్ ల‌పై స్పందించిన అలియా భ‌ట్‌

By:  Tupaki Desk   |   31 March 2022 11:04 AM GMT
#RRR : రూమ‌ర్ ల‌పై స్పందించిన అలియా భ‌ట్‌
X
రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ట్రిపుల్ ఆర్‌`. దాదాపు మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డులు తిర‌గ‌రాస్తూ స‌రికొత్త చ‌రిత్ర‌ని లిఖిస్తోంది. మ‌న దేశంలోనే కాకుండా ట్రిపుల్ ఆర్ మేనియా యుఎస్ లో ప‌తాక స్థాయికి చేరింది. భాష రాక‌పోయినా కానీ అక్క‌డి వారు ఈ చిత్రాన్ని ఎగ‌బ‌డి మ‌రీ చూస్తున్నారు. సినిమాపై ఆస‌క్తిక‌రంగా సోష‌ల్ మీడియా ట్వీట్ట‌ర్ వేదిక‌గా ట్రిపుల్ ఆర్ ఓ అద్భుతం అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ `బాహుబ‌లి` రికార్డ్స్ ని అధిగ‌మించేసి బాలీవుడ్ లో 200 కోట్ల క్ల‌బ్ లో చేర‌బోతోందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ల న‌ట‌న‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న వేళ సెల‌బ్రిటీలు, సినీ స్టార్స్ సినిమాపై , హీరోలు, డైరెక్ట‌ర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ ఓ అద్భుతం అని, ఓ ఎపిక్ మూవీ అని కొనియాడుతున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్ర బృందంపై అలిగిన హీరోయిన్ అలియాభ‌ట్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో వున్న ట్రిపుల్ ఆర్ పిక్స్ ని తొల‌గించిందంటూ గ‌త రెండు రోజులుగా నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది.

బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న త‌న‌కు సినిమాలో స‌రైన ప్రాధాన్య‌త నివ్వ‌లేద‌ని, త‌న‌కు సంబంధించిన చాలా వ‌ర‌కు సీన్ ల‌ని డైరెక్ట‌ర్ తొల‌గించాడ‌ని ఫీలైన అలియా భ‌ట్ కావాల‌నే త‌న సోస‌ల్ మీడియా అకౌంట్ ల‌లో వున్న ట్రిపుల్ ఆర్ కు సంబంధించిన పోస్ట్ ల‌ని డిలీట్ చేసింద‌ని ప్ర‌చారం మొద‌లైంది. ఈ ప్ర‌చారం త‌న చెవిన ప‌డ‌టంతో మొత్తానికి అలియా భ‌ట్ మొత్తాని గురువారం సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది. ఈ సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ని షేర్ చేసింది.

`ట్రిపుల్ ఆర్ విష‌యంలో నేను అప్ సెట్ అయ్యాన‌ని, ఆకార‌ణంగానే నా సోష‌ల్ మీడియా అకౌంట్ లో వున్న మూవీ ఫొటోస్ ని తొల‌గించానంటూ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఈ రోజే విన్నాను. ఇన్ స్టాలో దీనిపై రాద్ధాంతం చేయ‌వ‌ద్ద‌ని అంద‌రినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ప్ర‌తీసారి సోష‌ల్ అకౌంట్ లో వున్న ప్ర‌తీ ఓల్డ్ వీడియోస్ ని, ఫొటోల‌ని సాధార‌ణంగా తొల‌గిస్తూ వుంటాను. అదే క్ర‌మంలో ఈ ఫొటోల‌ని కూడా తొల‌గించాను అంతే. ట్రిపుల్ ఆర్ ప్ర‌పంచంలో లో నేను ఓ భాగం అయినందుకు చాలా గ‌ర్వ‌ప‌డుతున్నాను. సీత పాత్ర‌లో న‌టించ‌డాన్ని చాలా ఇష్ట‌ప‌డ్డాను` అని తెలిపింది అలియా భ‌ట్.

అంతే కాకుండా ఈ మూవీలో రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డ్డాను. అలాగే చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌తో క‌లిసి స్క్రీన్ పంచుకోవ‌డాన్ని ప్రేమించాను. తాజా వార్త‌ల‌పై నేను వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం రాజ‌మౌళి స‌ర్ ఆయ‌న టీమ్ ఎన్నో ఏళ్లు శ్రమించి ఈ అంద‌మైన చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు. అలాంటి సినిమా చుట్టూ త‌ప్పుడు ప్ర‌చారం జ‌ర‌గ‌డాన్ని నివారించ‌డానికే వివ‌ర‌ణ ఇస్తున్నాను` అని త‌న పోస్ట్ లో వెల్ల‌డించింది అలియా. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.