Begin typing your search above and press return to search.

అక్కినేని 'ఏజెంట్‌' డ్యూటీ ఎక్కడ చేస్తున్నాడు!

By:  Tupaki Desk   |   11 April 2022 4:45 AM GMT
అక్కినేని ఏజెంట్‌ డ్యూటీ ఎక్కడ చేస్తున్నాడు!
X
అక్కినేని ప్రిన్స్ అఖిల్‌ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఏజెంట్‌'. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అఖిల్ గత చిత్రం మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అదే జోష్ తో అఖిల్‌ ఈ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూర్తి అయ్యి విడుదల అవ్వాల్సి ఉన్నా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

హాలీవుడ్‌ యాక్షన్ సిరీస్ బోర్న్‌ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా లో అఖిల్‌ లుక్ ఇప్పటికే అక్కినేని అభిమానులకు పిచ్చెక్కిస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి అనుకున్నదాని కంటే మరింత భారీగా ఈ సినిమాను తెరకెక్కిస్తూ అక్కినేని అభిమానుల అంచనాలను రీచ్‌ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ సినిమాలో అఖిల్‌ సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించబోతున్నాడు. అంతే కాకుండా హీరోగా ఈయన సరికొత్తగా యాక్షన్‌ మూడ్‌ తో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన ప్రతి అంశం కూడా యాక్షన్‌ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని.. మాస్ ఆడియన్స్ కు మరింతగా దగ్గర చేసే విధంగా ఉంటుందంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ను వైజాగ్‌ లో చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వైజాగ్‌ లో భారీ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ కోసం షెడ్యూల్‌ రెడీ అయ్యిందట. అక్కడ నిర్వహించబోతున్న యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించిన ప్రాక్టీస్ మరియు ఇతర విషయాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. వైజాగ్‌ షెడ్యూల్‌ తో సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయినట్లు అవ్వబోతుంది.

హీరోయిన్ గా ఈ సినిమాలో అఖిల్‌ కు జోడీగా సాక్షి వైద్య నటిస్తున్న విషయం తెల్సిందే. ఏజెంట్‌ సినిమాలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టీ కీలక పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం తెలుగు మరియు మలయాళంలోనే కాకుండా ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారట.

పాన్ ఇండియా రేంజ్ లో ఈమద్య కాలంలో తెలుగు సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా సాహో సినిమా వంటి యాక్షన్‌ సినిమాలకు అక్కడ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఏజెంట్‌ సినిమాను కూడా అక్కడ భారీగా విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌ లో అనీల్‌ సుంకర భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ గా విడుదల చేయబోతున్నారు.

భారీ స్వాగతం :

ఏజెంట్‌ సినిమా కోసం వైజాగ్‌ వెళ్లిన అఖిల్ కి అక్కడి అభిమానులు భారీగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి షూటింగ్‌ స్పాట్‌ వరకు వందల కొద్ది బైక్ లు మరియు కార్లతో అఖిల్‌ కు ఘన స్వాగతం పలికి ర్యాలీ తీయడం జరిగింది. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.