Begin typing your search above and press return to search.
శ్రీవారిని దర్శించుకున్న నిహారిక దంపతులు
By: Tupaki Desk | 14 Dec 2020 11:51 AM ISTకొత్తగా పెళ్లైన నిహారిక-చైతన్య దంపతులు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు. ఇటీవలే రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వీరు శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
ఆలయానికి చేరుకున్న నూతన దంపతులకు అధికారులు స్వాగతం పలికి స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ప్రముఖ మెగా నటుడు నాగబాబు కుమార్తెకు, గుంటూరు మాజీ ఐజీ జే. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యకు ఇటీవలే వివాహం జరిగింది. 9న వీరి పెళ్లికి మెగా, అల్లు కుటుంబాలు హాజరై సందడి చేశారు.
ఇక డిసెంబర్ 11న హైదరాబాద్ లో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా పెళ్లితంతు ముగియడంతో ఇష్టదైవమైన దేవుడిని దర్శించుకున్నారు.