Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్ అచ్చి రాలేదేమో మహేష్

By:  Tupaki Desk   |   29 Nov 2016 3:59 AM GMT
న్యూ ఇయర్ అచ్చి రాలేదేమో మహేష్
X
మహేష్ బాబు కొత్త సినిమా ఫుల్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ లో భాగంగా అహ్మదాబాద్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. మహేష్ మొదటిసారిగా చేస్తున్న ఈ ద్విభాషా చిత్రం.. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఏకకాలంలో రూపొందుతోంది.

మూడో షెడ్యూల్ వరకూ వచ్చేసినా ఇప్పటివరకూ ఈ సినిమాకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. అయితే.. జనవరి 1న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని.. అందులోనే టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా ఉంటుందనే విషయం తాజాగా బయటకొచ్చింది. ఓ రకంగా ఇది సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూసే కానీ.. ఓ విషయం తలుచుకుని తెగ ఫీలయిపోతున్నారు ఫ్యాన్స్. ఈ ఏఢాది జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా బ్రహ్మోత్సవానికి టీజర్ రిలీజ్ చేశాడు మహేష్. టీజర్ ఎంతగా సక్సెస్ అయినా.. ఆ మూవీ మాత్రం మహేష్ అభిమానులు మర్చిపోలేనంత స్థాయిలో డిజాస్టర్ గా నిలిచింది. అందుకే జనవరి 1 మనకు అచ్చి రాలేదుగా మహేష్ అంటున్నారు ఫ్యాన్స్.

అందుకే మరోసారి జనవరి 1 అనగానే అమ్మో అనుకుంటున్నారు అభిమానులు. ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధమేంటి.. డేట్ మ్యాచ్ అయితే ఫేట్ మ్యాచ్ అవుతుందా అనుకోవచ్చు కానీ.. సినిమా రంగం అంటే సెంటిమెంట్స్ ఇలాగే ఉంటాయ్ మరి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/