Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ లో కొత్త ట్విస్టు

By:  Tupaki Desk   |   31 May 2019 4:29 AM GMT
ఆర్ ఆర్ ఆర్ లో కొత్త ట్విస్టు
X
తన పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉంటే తప్ప రెగ్యులర్ పాత్రలు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఒప్పుకోని సాయి పల్లవి కొంత గ్యాప్ తర్వాత ఇవాళ సూర్య ఎన్జికెతో ప్రేక్షకులకు దర్శనమిచ్చింది. తెలుగు సినిమాలు ఆచి తూచి ఎంచుకుంటున్న సాయి పల్లవితో ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ టీం టచ్ లోకి వెళ్లిందని ఫిలిం నగర్ టాక్. షూటింగ్ ప్రారంభమైన కొద్దిరోజులకే వ్యక్తిగత కారణాల వల్ల ఇందులో నుంచి తప్పుకుంటున్నట్టు విదేశీ నటి డైసి ప్రకటించడంతో జూనియర్ ఎన్టీఆర్ సరసన భామ ప్లేస్ అలాగే ఖాళీగా ఉండిపోయింది.

ఇంకో ఫారిన్ బ్యూటీని సెట్ చేస్తారు అనుకుంటున్న తరుణంలో మరో అప్ డేట్ ఏంటంటే కథలోనే కొద్దిగా మార్పులు చేసి ఆ పాత్రను భారతీయ యువతిగా మార్చేశారట. సో ఇప్పుడు ఆప్షన్ గా ఎవరినైనా తీసుకోవచ్చు. ఈ కారణంగానే సాయి పల్లవిని రాజమౌళి తరఫున యూనిట్ సంప్రదించినట్టు ఫిలిం నగర్ టాక్. ఇందులో నిజం ఎంతుందో కాని ఒకవేళ వాస్తవమే అయితే ఇప్పటికే పీక్స్ లో ఉన్న హైప్ కు ఇంకాస్త తోడవుతుంది. కాకపోతే ఆర్ ఆర్ ఆర్ లో నటించాలి అంటే చాలా బల్క్ లో డేట్స్ కావాలి.

సాయి పల్లవికి ఉన్న కమిట్ మెంట్స్ లో అదంత ఈజీ కాదు. మరి ఏం సమాధానం చెబుతుందనేది సస్పెన్స్. అఫీషియల్ గా చెప్పే దాకా ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించి ఏదీ నమ్మలేని పరిస్థితి. త్వరలో అహ్మదాబాద్ వెళ్లనున్న ఆర్ ఆర్ ఆర్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జూనియర్ ఎన్టీఆర్ తో కొంత పార్ట్ షూటింగ్ లో ఉంది. రామ్ చరణ్ ఆఫ్రికా హాలిడేస్ నుంచి రాగానే నేరుగా అవుట్ డోర్ షెడ్యూల్ లో పాల్గొంటాడు