Begin typing your search above and press return to search.
చెర్రీతో బోయపాటి.. ఓ ట్విస్టుంది
By: Tupaki Desk | 2 Jan 2018 3:03 PM ISTరేపటి నుండి రాజమండ్రిలో 'రంగస్థలం' సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టున్నాడట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గతంలో సమ్మర్ లో అక్కడ తీయాల్సిన కొన్ని సీన్లు పెండింగు ఉండటంతో.. ఇప్పుడు సుకుమార్ వాటిని పూర్తి చేస్తాడట. అయితే ఈ తతంగం అంతా ఒక 15 రోజుల్లో ముగించేసి.. ఆ తరువాత బోయపాటి శ్రీను డైరక్షన్లో కొత్త సినిమాను మొదలెడతాడు ఈ మెగా హీరో అనేది మనం ఎప్పటినుండో వింటున్నాం. కాని ఇప్పుడు అక్కడో ట్విస్టుందని తెలుస్తోంది.
నిజానికి బోయపాటి సింపుల్ సీన్లను కూడా చాలా పవర్ ఫుల్ గా తీసే సమర్దుడు. అందులో నో డౌట్. కాని కంటెంట్ లేకుండా సినిమాలను తీస్తున్నాడని జయ జానకి నాయక సినిమాను చూసిన సినిమా లవ్వర్స్ కామెంట్ చేశారు. అలాంటి రొటీన్ స్టోరీలను చేస్తే ఆడియన్స్ కూడా తిరస్కరిస్తున్నారు. అందుకే జయ జానకి నాయక సినిమాకు చాలా చోట్ల లాస్ వచ్చిందనేది ట్రేడ్ వర్గాల ఫీలింగ్ కూడాను. ఇవన్నీ ఆ నోటా ఈ నోటా రామ్ చరణ్ చెవిన కూడా పడ్డాయట. అందుకే బోయపాటి చెప్పిన కథను ఇంకా చరణ్ ఓకే చేయలేదని తెలుస్తోంది.
నిజానికి కథ లేకుండా సరైనోడు తరహాలో చరణ్ కు కూడా కమర్షియల్ హిట్టివ్వొచ్చు కాని.. వరుసగా ధృవ అండ్ రంగస్థలం వంటి కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తున్న చెర్రి అందుకు సిద్దంగా లేడట. అందుకే బోయపాటి చెప్పిన స్టోరీ విని.. కథలో కేవలం రొటీనత్వం ఎక్కువగా ఉండటంతో.. కొన్ని ఏరియాల్లో ఇంకా వర్క్ చేసి తీసుకురమ్మని చెప్పాడట చరణ్. ఇక మార్పులు చేర్పులు చేసిన కథను ఇంకా బోయపాటి తన హీరోకు వినిపించనేలేదని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అది వినిపించాలి.. చరణ్ ఓకె అనాలి.. అప్పుడు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలి. అంతుంది కథ.