Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: పాన్ ఇండియా ప్యాకేజీతో న‌యా ట్రెండ్

By:  Tupaki Desk   |   26 Jun 2021 1:00 PM IST
టాప్ స్టోరి: పాన్ ఇండియా ప్యాకేజీతో న‌యా ట్రెండ్
X
ఇప్పుడంతా ప్యాకేజీల‌ ట్రెండ్ న‌డుస్తోంది. ఇరుగు పొరుగును క‌లుపుకుని భారీ ప్యాకేజీ సినిమాలు తీసేందుకు మ‌న ద‌ర్శ‌క ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స్టార్ హీరోలు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. పొరుగు నుంచి ప్యాకేజీ కాన్సెప్ట్ కి రెస్పాన్స్ అంతే ప్రోత్సాహ‌కంగా ఉంది.

ఒక‌ త‌మిళ హీరో- తెలుగు నిర్మాత- తెలుగు ద‌ర్శ‌కుడు- బాలీవుడ్ హీరోయిన్ .. ఇదో త‌ర‌హా ప్యాకేజీ. లేదా ఒక తెలుగు హీరో- త‌మిళ విలన్- తెలుగు ద‌ర్శ‌కుడు- బాలీవుడ్ క‌థానాయిక‌.. ఇదో ర‌కంగా ప్యాకేజీ. ఒక్కోసారి మ‌ల‌యాళ‌.. క‌న్న‌డ స్టార్ల‌ను క‌లుపుకుని తెలుగు - త‌మిళ ప‌రిశ్ర‌మల ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు ప్యాకేజీల‌ను ప‌ర్ఫెక్ట్ గా ఫిట్ చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా రేంజులో బాగా వ‌ర్క‌వుట‌య్యే ఫార్ములాగా క‌నిపిస్తోంది. హిందీ ప‌రిశ్ర‌మ నుంచి ప్ర‌ముఖ నిర్మాత‌లు డిస్ట్రిబ్యూట‌ర్లు పాన్ ఇండియ‌న్ సినిమాల్ని రిలీజ్ చేసేందుకు ఆస‌క్తిగా ఉండ‌డంతో అది మ‌న మార్కెట్ రేంజును పెంచుకునేందుకు స‌హ‌క‌రిస్తోంది.

నిజానికి ప్ర‌భాస్ న‌టిస్తున్న సినిమాల‌న్నీ హిందీ నిర్మాత‌లను పంపిణీదారుల‌ను క‌లుపుకుని బాలీవుడ్ హీరోయిన్ల‌తో క‌లిసి ప్లాన్ చేస్తుండ‌డంతో అవ‌న్నీ పాన్ ఇండియా సినిమాలుగా మార్కెట్ ని కొల్ల‌గొడుతున్నాయి. అదే తీరుగా ఇప్పుడు దిల్ రాజు వంటి వారు శంక‌ర్ స‌హా త‌మిళ హిందీ నిర్మాత‌ల‌ను ఫైనాన్షియ‌ర్ల‌ను క‌లుపుకుని భారీ చిత్రాల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. దీనికి చ‌ర‌ణ్ స‌హా మ‌న స్టార్ హీరోలు ఆస‌క్తిగానే ఉన్నారు. ఇప్పుడు ఈ రేసులోకి ఇత‌ర అగ్ర నిర్మాణ సంస్థ‌లు చేరుతున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ - సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ కూడా ఈ త‌ర‌హాలో పెద్ద ప్ర‌ణాళిక‌ల్ని విస్త‌రిస్తోంది.

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ధ‌నుష్ తో ఇదే త‌ర‌హా ప్ర‌ణాళిక‌కు టాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లు తెర లేపాయి. ధ‌నుష్ కి ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ భారీగా ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ కంటే ముందే పాన్ ఇండియా స్టార్ డ‌మ్ సంపాదించిన హీరోగా అత‌డికి గుర్తింపు ఉంది.

ధ‌నుష్ హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ నారంగ్ -పుష్కూర్ రామ్ మోహన్ రావు ద్విభాషా చిత్రం చేస్తుండ‌గా.. ఇంత‌లోనే ప‌లు తెలుగు నిర్మాణ సంస్థ‌లు ధ‌నుష్ తో సినిమా చేసేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచాయి. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ స‌హా ఇత‌ర బ్యాన‌ర్లు ప్యాకేజీ సిస్ట‌మ్ లోకి చేరుతున్నాయి. తెలుగు నిర్మాత‌-ద‌ర్శ‌కుడు- త‌మిళ హీరో- బాలీవుడ్ హీరోయిన్ కాంబినేష‌న్ ప్ర‌తిపాదిక‌న బిగ్ ప్లానింగ్ తో ముందుకు సాగ‌నుంది స‌ద‌రు సంస్థ‌.

టాలీవుడ్ కోలీవుడ్ స్టార్ల‌ అలయెన్స్ తో ఇటీవ‌ల ద్వి-త్రిభాషా చిత్రాలు తెర‌కెక్కుతున్న నేప‌థ్యంలో మునుముందు భారీ మ‌ల్టీస్టార‌ర్ల‌కు పాన్ ఇండియా చిత్రాల‌కు ఆస్కారం ఉంది. ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ పాపులారిటీ ఉన్న స్టార్ల‌ను క‌లుపుకుని ప్యాకేజీ సిస్ట‌మ్ లో సినిమా చేయ‌డం స‌ద‌రు నిర్మాణ సంస్థ‌ల‌కు క‌లిసొచ్చేదే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ధ‌నుష్- విజ‌య్- సూర్య‌- రామ్ చ‌ర‌ణ్ .. వీళ్లంతా ప్ర‌స్తుతం ప్యాకేజీ సిస్ట‌మ్ లో అడుగుపెట్టి దీనిని పెద్ద స్థాయికి తీసుకెళుతున్నార‌నే భావించాల్సి ఉంటుంది.