Begin typing your search above and press return to search.

చిరు ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్

By:  Tupaki Desk   |   16 Aug 2019 5:21 PM GMT
చిరు ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్
X
సైరా మీద హైప్ గురించి ఇతర విషయాల గురించి ఎలాంటి ఆందోళన అనుమానం అక్కర్లేదు కానీ అసలైన ఒక్క విషయం మాత్రం మెగా ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. అదే మెగాస్టార్ చిరంజీవి లుక్. మొన్న వదిలిన మేకింగ్ వీడియోలో చిరు పూర్తి క్లోజ్ అప్ ఒకే షాట్ లో కనిపించారు. అది కూడా జులపాలు వదిలేసిన జుట్టుతో శత్రువులను భీకరంగా కత్తితో నరుకుతున్న షాట్. అందులో లుక్స్ పరంగా క్లారిటీ లేదు.

దీన్నే అవకాశంగా తీసుకుని ప్రత్యర్థి హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఒకరిమీద మరొకరు తీవ్ర స్థాయిలో ట్విట్టర్ లాంటి వేదికల్లో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పాత ఫోటోలు స్టిల్స్ ని అన్ని బయటికి తీసి సదరు హీరోల పరువు పోయేలా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూసి ఒకరకంగా చెప్పాలంటే ఇదంతా జుగుప్సాకరంగా ఉంది. వాడుతున్న బాష అంతదారుణంగా ఉంది మరి.

ఒకరకంగా ఇది వైరల్ గా మారి వాళ్ళ హీరోల పరువు వాళ్ళే తీసుకుంటున్న కొందరి ప్రవర్తన నిజమైన ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. పోస్టర్ల సంగతి పక్కనపెడితే సైరా నరసింహారెడ్డిగా చిరు కంప్లీట్ లుక్ ఎలా ఉందనేది నిజానికి ఇప్పటిదాకా క్లారిటీ లేదు. గత ఏడాది టీజర్ లో కోట గుమ్మం మీద నిలబడ్డ చిరుని డార్క్ లైటింగ్ లో చూపించారు కానీ అందులోనూ స్పష్టత లేదు. అందుకే వీటికి సమాధానం టీజర్ లో దొరకాలని కోరుతున్నారు.

ఇవాళ పవన్ సైరా టీజర్ కు డబ్బింగ్ చెబుతున్న ఫొటోల్లో కనిపించే కనిపించకుండా స్క్రీన్ మీద రౌద్ర రూపం దాల్చిన చిరు పిక్ ఒకటి కొత్త అనుమానాలు కలిగించేలా ఉండటం ఇంకాస్త నిప్పుని రాజేస్తోంది. యూనిట్ మాత్రం ఇవన్నీ అనవసరమైన భ్రమలు ప్రచారాలని టీజర్ వచ్చాక అందరి నోళ్లు మూతబడే స్థాయిలో విజువల్స్ చిరు లుక్స్ ఉంటాయని హామీ ఇస్తున్నారు. ఇంకో నాలుగు రోజులు ఆగితే ఈ సస్పెన్సూ వీగిపోతుంది. చూద్దాం