Begin typing your search above and press return to search.

కసి స్టార్: న్యూ సోషల్ మీడియా సెన్సేషన్

By:  Tupaki Desk   |   5 July 2019 11:25 AM GMT
కసి స్టార్: న్యూ సోషల్ మీడియా సెన్సేషన్
X
ఈ సోషల్ మీడియా అనేది ఒక మహా సముద్రం. సోషల్ మీడియాను సరిగ్గా వాడుకుంటే పెద్ద స్టార్ అయిపోవచ్చు. గతంలో ఇలా సోషల్ మీడియా సెన్సేషన్లు చాలామందే ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు సంబంధించినంత వరకూ సోషల్ మీడియా ప్రతి సీజన్ లో ఒక ట్రెండింగ్ స్టార్ ఉంటాడు. ఒక్కో సీజన్ లో ఒక్కొకరి హవా సాగుతుంది. గత ఎలెక్షన్ సీజన్ లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ ఒక సోషల్ మీడియా స్టార్ గా సంచలనం సృష్టించారు. ఆయన ఒక వీడియోలో కనిపిస్తే చాలు.. అంతే.. ఆ వీడియోకు లక్షల కొద్దీ వ్యూస్..లైకులు వచ్చి పడేవి. రాజకీయాలకు అతీతంగా పాల్ గారి కామెడీకి చాలామంది నెటిజన్లు అభిమానులుగా మారిపోయారంటే ఆఆయన ఏ రేంజ్ లో జనాలను ఎంటర్టైన్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు సోషల్ మీడియాలోకి కొత్త స్టార్ వచ్చారు. ఆయనే 'కసి స్టార్' ఉప్పల్ బాలు. టిక్ టాక్ వీడియోస్ తో తెగ పాపులర్ అయిన ఈ ఉప్పల్ బాలు భారీ ఫాలోయింగ్ సంపాదించాడు. ఈ ఉప్పల్ బాలు 'పటాస్' లాంటి పలు టీవీ షోస్ లో కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు ఈయన ఒక వీడియోలో అలా కనిపిస్తే చాలు.. యూట్యూబ్ లో లక్షల కొద్ది వ్యూస్ వచ్చిపడుతున్నాయి. దాన్ని కసి కామెడి అనుకుంటారో లేదా లేకి కామెడి అనుకుంటారో తర్వాత సంగతి.. కామెడీకి అసలు కొదవ లేదు. ఇంతకీ ఈ 'కసి స్టార్' అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే.. ఉప్పల్ బాలు ఒక పది డైలాగ్స్ మాట్లాడితే అందుకో ఒకసారి అయినా 'కసి' అనే పదం దొర్లుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే "మీరు బిగ్ బాస్ 3 కి ఎంపిక అయ్యారని టాక్ వినిపిస్తోంది.. హోస్ట్ గా అక్కినేని నాగార్జున గారి యాకరింగ్ ఎలా ఉంటుందని మీ అభిప్రాయం?" అని అడిగితే.. "నాగార్జున గారు కేక. చాలా బాగా మాట్లాడతారు. అయనలో మాటల్లోనే ఒక కసి ఉంటది. అది నాకు తెలుసు" అన్నాడు.

ఈ ఉప్పల్ బాలు పాపులారిటీ ని ఉపయోగించుకునేందుకు చాలామంది యూట్యూబ్ చానల్స్ పోటీ పడుతూ వీడియో ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి. ఆ ఇంటర్వ్యూలు మామూలుగా లేవు. బాలు హావభావాలు.. మాటలు.. 'అదోరకంగా' ఉండడంతో ఒక ఇంటర్వ్యూ లో ఆయనను "బాలు గారు మిమ్మల్ని బయట చాలామంది గే అనుకుంటున్నారు .. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?" అని అడిగితే సదరు ఇంటర్వ్యూయర్ పై మండిపడుతూ "ఇది తప్ప మరో టాపిక్ ఉండదా.. ఎందుకు అలా పిచ్చిపిచ్చిగా మాట్లాడతారు? అదో పెద్ద క్వశ్చనా..? ఒకవేళ.. అయితే ఏమైతది అంట? అంటే వాళ్ళు మనుషులు కారా?" అంటూ రెచ్చిపోయాడు.

ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ కసి స్టార్ కు సంబంధించి రెండు వర్గాలు ఉన్నాయి. ఒక సెక్షన్ ఉప్పల్ బాలు ఫ్యాన్స్. రెండో సెక్షన్ మాత్రం కామెడీ చేస్తూ బాలుని ట్రోలింగ్ చేసే వారు. మీకు ఈ కసి స్టారే గురించి తెలిస్తే సరే.. లేకపోతే ఈ ఉప్పల్ బాలు వీడియోస్ పై ఒక లుక్కేయండి. కసిగా చూడడం మర్చిపోకండే..!