Begin typing your search above and press return to search.

'కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్' తో ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   27 Oct 2022 5:48 AM GMT
కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ తో ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..!
X
టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటూ.. అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. 'పటాస్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్.. వినోదానికి పెద్ద పీట వేస్తూ కమర్షియల్ హిట్లు అందుకుంటున్నాడు.

'సుప్రీమ్' 'రాజా ది గ్రేట్' 'F2' 'సరిలేరు నీకెవ్వరు' 'ఎఫ్ 3' వంటి డబుల్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ఈ డైరెక్టర్ ఖాతాలో ఉన్నాయి. వెండితెర మీద తనదైన సినిమాలతో అలరిస్తున్న అనిల్.. ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు.

తెలుగు ఓటీటీ 'ఆహా' వేదికగా డిజిటల్ వరల్డ్ లో ఎంటర్ అవ్వడానికి అనిల్ రావిపూడి సిద్ధమయ్యారు. 'కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్' అనే కామెడీ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని నిర్వాహకులు బుధవారం తెలియజేసారు.

'అయ్యోరు వచ్చినారు.. తెలుగు సినిమాలో కామెడీ డెఫినిషన్, డెస్టినేషన్ రెండూ మార్చిన మన అనిల్ రావిపూడి గారు కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారహో' అంటూ ఆహా టీం 'కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్' ప్రోగ్రామ్ కి అనౌన్స్ చేసింది.

ఈ సందర్భంగా కామెడీకి కేరాఫ్ అడ్రెస్ ఐ పేర్కొంటూ అనిల్ రావిపూడి కి సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించారు. CSE ప్రోగ్రాం ని త్వరలోనే ప్రసారం చేయనున్నట్లు ఆహా టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరించనున్న 'కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్' షోలో వేణు - ముక్కు అవినాష్ - బుల్లెట్ భాస్కర్ - సుడిగాలి సుధీర్ - సద్దాం - జ్ఞానేశ్వర్ - యాదమ్మ రాజు - ఎక్సప్రెస్ హరి వంటి కమెడియన్స్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ ప్రోగ్రాం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

ఇప్పటికే అనేకమంది టాలీవుడ్ దర్శకులు ఓటీటీలలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొందరు వెబ్ మూవీస్ తీస్తే మరికొందరు ఆసక్తికరమైన ఒరిజినల్ సిరీస్ లు రూపొందిస్తున్నారు. ఇంకొందరు నిర్మాతలుగా మారి ఓటీటీ కంటెంట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు 'కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్' షో ద్వారా అనిల్ రావిపూడి డిజిటల్ స్పేస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ ప్రోగ్రామ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.

ఇక సినిమాల విషయానికొస్తే.. డబుల్ హ్యాట్రిక్స్ తో ఫుల్ ఫార్మ్ లో ఉన్న అనిల్.. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణతో సినిమా కోసం సన్నద్ధం అవుతున్నారు. #NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేయబడిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

'బాలయ్య - అనిల్' ప్రాజెక్ట్‌ ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌ తో నిర్మించనున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూర్చనున్నారు. ఇందులో బాలకృష్ణ ను ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో చూడబోతున్నట్లు దర్శకుడు తెలిపారు. 'వీర సింహా రెడ్డి' సినిమా పూర్తైన తరవాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.