Begin typing your search above and press return to search.
బిగ్ బ్రేకింగ్: RRR కోసం సరికొత్త రిలీజ్ డేట్..!
By: Tupaki Desk | 31 Jan 2022 12:31 PM GMTదర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాని మార్చి 18న లేదా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అయితే తాజాగా RRR కోసం మేకర్స్ సరికొత్త రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు.
'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని మార్చి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగినా.. మార్చి నెలాఖరుకు కరోనా థర్డ్ వేవ్ ప్రభావం తగ్గి.. పలు రాష్ట్రాల్లో థియేటర్లపై కొనసాగుతున్న ఆంక్షలు ఎత్తేసారని చిత్ర బృందం భావిస్తోంది. మరి ఈసారైనా చెప్పిన సమయానికి ఈ భారీ మల్టీస్టారర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.
కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ''ఆర్.ఆర్.ఆర్'' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత స్వభావాల ఆధారంగా కల్పిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రామరాజుగా చరణ్.. భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది.
బాలీవుడ్ స్టార్స్ అలియా భట్ - అజయ్ దేవగన్ తో పాటుగా ఒలివియా మోరిస్ - శ్రియా శరణ్ - సముద్ర ఖని ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాని నిర్మించారు.