Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లోకి కొత్తగా మరో పెద్ద నిర్మాణ సంస్థ..!

By:  Tupaki Desk   |   4 Aug 2021 2:44 PM IST
టాలీవుడ్ లోకి కొత్తగా మరో పెద్ద నిర్మాణ సంస్థ..!
X
ప్రస్తుతం టాలీవుడ్‌ లో పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేవి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ - సురేష్ ప్రొడక్షన్స్ - వైజయంతీ మూవీస్ -యూవీ క్రియేషన్స్ - మైత్రీ మూవీ మేకర్స్ - అన్నపూర్ణ స్టూడియోస్ - లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ - 14 రీల్స్ - ఏకే ఎంటర్టైన్మెంట్స్ - సితార ఎంటర్టైన్మెంట్స్.. ఇలా మరికొన్ని సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు వీటికి ధీటుగా నిలిచేలా టాలీవుడ్ లోకి మరో పెద్ద నిర్మాణ సంస్థ వస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ బిజినెస్ మెన్ గా కొనసాగుతున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. ఇప్పుడు సినిమా మీద ప్యాషన్ తో చిత్ర నిర్మాణంలో అడుగుపెడుతున్నారు. 'భద్ర ప్రొడక్షన్స్' అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి, కంటెంట్ బేస్డ్ సినిమాలు మరియు విభిన్న తరహా చిత్రాలను రూపొందించాలని నిశ్చయించుకున్నారు. చిన్న మీడియం రేంజ్ సినిమాలతో పాటుగా భారీ బడ్జెట్ చిత్రాలను కూడా నిర్మించాలని సంకల్పించారు. ఈ క్రమంలో యంగ్ టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో కొత్త న‌టీన‌టులకు, సాంకేతిక నిపుణులకు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు.

ఇప్పటికే 'భద్ర ప్రొడక్షన్స్' బ్యానర్ పై కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ లను సిద్ధం చేసిన నిర్మాతలు.. ఈ రోజు బుధవారం ప్రొడక్షన్ నెం.1 ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఇదొక న్యూ ఏజ్ థ్రిల్లర్ అని తెలిపారు. శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. '100% లవ్' చిత్రానికి వర్క్ చేసిన వెంకట్ ప్రసాద్ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గ్యారీ BH ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించగా.. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు టెక్నిషియన్స్ ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.