Begin typing your search above and press return to search.

'పెళ్ళిచూపులు'తో కొత్త పెళ్ళి కొడుకులు

By:  Tupaki Desk   |   4 Aug 2016 10:30 PM GMT
పెళ్ళిచూపులుతో కొత్త పెళ్ళి కొడుకులు
X
కోటి రూపాయలలో ఒక సినిమా తీయడం. దానిని 2 కోట్లకు అమ్మేయడం. హిట్టయితే చక్కగా లాభాల్లో కూడా కాస్త పర్సంటేజ్ ఉంటుంది. శాటిలైట్ రైట్స్ ఇంకా లాభదాయకం. అయితే కంటెంట్ బాగుంటేనే ఇలాంటి లాభాలన్నీ వచ్చేది. కంటెంట్ తేడా కొడితే మాత్రం ఇన్వెస్ట్మెంట్ అంతా బూడిదలో పోసిన పన్నీరే. ఇంతకీ ఇప్పుడు ఈ లాజిక్కులన్నీ ఎందుకు చెబుతున్నాం అనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం.

''పెళ్ళి చూపులు'' సినిమా హిట్టవ్వడంతో ఇప్పుడు ఫిలిం ఇండస్ర్టీకి చాలామంది కొత్త పెళ్లి కొడుకులు వస్తున్నారు. కొంపతీసి హీరోలూ హీరోయిన్లు దర్శకులూ అనుకునేరు.. కాదండీ బాబూ.. చాలామంది కొత్త కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నారు. చక్కగా ఓ మాంచి షార్ట్ ఫిలిం డైరక్టర్ ను ఎంచుకుని.. సరైన సబ్జెక్ట్ సెలక్టు చేసుకుని.. కోటి లోపు సినిమాను కొట్టేస్తే.. హిట్టయితే ఇక కాసులేగా. పైగా ఆ ఫేం ఆ నేమ్.. ఆ లెక్కే వేరు. ''పెళ్ళి చూపులు'' సినిమా హిట్టవ్వడంతో దాన్నే ఇనిస్పిరేషన్ గా తీసుకుని ఇలా టాలీవుడ్ కు వచ్చేసే ఎన్నారై నిర్మాతల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉందని అనిపిస్తోంది.

ఇక్కడే వీళ్లందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో నిజంగా సంచలనాత్మకంగా ఆడిన చిన్న సినిమాలను చూస్తే.. చిన్నవంటే చిన్నవి కాదు బీభత్సమైన లో బడ్జెట్ సినిమాలను చూస్తే.. ''చిత్రం'' ''ఈరోజుల్లో'' ''పెళ్ళిచూపులు''.. ఈ మూడే ట్రెండ్ సెట్టింగ్ మూవీస్. అంటే ఎన్నాళ్ళకు ఇలాంటి సినిమాలు పడుతున్నాయో చూడండి పొడ్డూసర్లూ. జర జాగ్రత్తయ్యా!!