Begin typing your search above and press return to search.

మాస్ట్రో లుక్: యూత్ స్టార్ పాలిట లేడీ విల‌న్..!

By:  Tupaki Desk   |   15 Aug 2021 7:30 AM GMT
మాస్ట్రో లుక్: యూత్ స్టార్ పాలిట లేడీ విల‌న్..!
X
యూత్ స్టార్ నితిన్- త‌మ‌న్నా- న‌భా న‌టేష్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్రం `మాస్ట్రో`. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కుడు. శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. OTT లో విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా చిత్ర బృందం నితిన్ -త‌మ‌న్నా ల‌ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. నితిన్ బ్లేజర్ ధ‌రించి స‌న్ గ్లాసెస్ లో స్టైలిష్ గా క‌నిపిస్తుండ‌గా.. తమన్నా గన్ చేత‌ప‌ట్టి హాట్ హాట్ గా క‌నిపిస్తోంది. ఇంత‌కీ నితిన్ కి గురి పెట్టిందా లేక ఎదుటివారికి ఏదైనా హింట్ ఇస్తోందా? అన్న‌ది తెర‌పైనే తెలియాలి.

త‌మ‌న్నా ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌ను పోషిస్తోంద‌ని స‌మాచారం. న‌భా క‌థానాయిక‌గా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే నితిన్ .. న‌భా పోస్ట‌ర్లు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా నేడు విడుద‌లైన‌ సినిమా పోస్టర్లలో త‌మ‌న్నా కనిపించడం ఉత్కంఠ రేపింది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్ట‌ర్లు టీజ‌ర్లు ఆక‌ట్టుకున్నాయి. మునుముందు మ‌రింత‌గా వైర‌ల్ గా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌నున్నార‌ని స‌మాచారం.

వేచి చూసే ధోర‌ణితోనే..

మ‌రోవైపు నితిన్ హీరోగా న‌టించిన మాస్ట్రో ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు శ్రేష్ఠ్ సంస్థ ప్ర‌య‌త్నాల్లో ఉన్నా అక్టోబ‌ర్ రిలీజ్ కండీష‌న్ వ‌ల్ల కాస్త వేచి చూసే ధోర‌ణిని అనుస‌రిస్తోంది. స‌న్నివేశం స‌ద్దుమ‌ణిగాక ఓటీటీ రిలీజ్ తేదీని ప్ర‌క‌టించాల‌ని భావిస్తున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల పార్కింగ్ ఫీజు స‌హా ప‌లు వెసులుబాట్ల‌కు ప్ర‌భుత్వం అంగీక‌రించింది. అటు ఏపీలోనూ టిక్కెట్టు రేట్ల‌పై సీఎం జ‌గ‌న్ తో మెగాస్టార్ భేటీకి స‌మ‌య‌మాస‌న్న‌మైంది. ఈ నేప‌థ్యంలో మాస్ట్రో రిలీజ్ ఆలోచ‌న మారుతుందా? ఓటీటీ కాకుండా థియేట్రిక‌ల్ రిలీజ్ చేస్తారా? అన్న‌ది చూడాల్సి ఉంది.