Begin typing your search above and press return to search.

జక్కన్న అక్కడికి మకాం మార్చాడట!

By:  Tupaki Desk   |   13 Nov 2018 10:26 PM IST
జక్కన్న అక్కడికి మకాం మార్చాడట!
X
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న #RRR రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 19 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ జరిగే సెట్ ను కోకాపేట్ లో వేయడం జరిగిందట. ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే సినిమా షూటింగ్ కు సంబంధించిన సెట్ తో పాటుగా రాజమౌళి కోసం ఒక పోర్షన్ లో ఇల్లు కూడా డిజైన్ చేశారట.

పల్లెటూరిలో ఉండే ఒక మండువా లాంటి ఇల్లు డిజైన్ లో అన్ని ఆధునిక వసతులు ఉండేలా తీర్చిదిద్ధారట. ఇందులో రాజమౌళి మిగతా టీమ్ మెంబర్స్ తో కలిసి చర్చలు జరిపేందుకు ఒక పెద్ద మీటింగ్ హాలుతో పాటుగా #RRR బృందం అంతా కలిసి భోజనం చేసేలా ఒక డైనింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేశారట. ఈ ఇంటి ఆవరణలో మంచి పూల మొక్కలు పెట్టి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చి దిద్దారట. వీటితో పాటుగా రాజమౌళి ఈ సినిమాలో పనిచేసే నటులతో రిహార్సల్స్ చేయించేందుకు ఒక ట్రైనింగ్ రూమ్ ను కూడా రెడీ చేశారట.

ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.. జక్కన్న రోజూ తన మణికొండలో ఉండే తన ఇంటినుండి సినిమా సెట్ కు ప్రయాణం చెయ్యకుండా సెట్ లోకే మకాం మారుస్తున్నాడట. అంటే ఇకపై జక్కన్న కేరాఫ్ కోకాపేట్ అనుకోవచ్చు. టెంపరరీగానే లేండి.