Begin typing your search above and press return to search.
కామెంట్: తెలుగు సినిమాలో కొత్త సౌండ్స్
By: Tupaki Desk | 20 Oct 2015 11:00 PM ISTఏ సినిమా విజయంలో అయినా.. హీరో - డైరెక్టర్ తోపాటు మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర చాలా కీలకం. సంగీతం విషయంలో చిన్నా పెద్దా తేడా అని ఉండదు. మ్యూజిక్ కిక్ ఇచ్చిందా లేదా అనే ఆలోచిస్తారు ప్రేక్షకులు.
మ్యూజిక్ విషయంలో ఆడియన్స్ ఒక్కరే కాదు.. మూవీ మేకర్స్ టేస్ట్ కూడా చేంజ్ అవుతోంది. ఒకప్పుడు సంగీత దర్శకులు ట్యూన్స్ తో లైబ్రరీ నిర్వహించేవారు. అంటే వాళ్ల దగ్గరికి వెళ్తే.. వరుసగా ట్రాక్స్ వినిపిస్తారు. నచ్చినవి సెలెక్ట్ చేసుకోవడమే అన్నట్లుగా ఉండేది వ్యవహారం. ఇప్పుడలాంటి డ్రమ్స్ మోగవు.. అంతా స్పాంటేనియస్ గా రియాక్ట్ అవాల్సిందే.
సన్నీ ఎంఆర్ - గిబ్రాన్ వంటి కొత్త సంగీత దర్శకులు.. నయా ట్రెండ్ సృష్టిస్తున్నారు. తెలుగు సినిమాకి సౌండింగ్ మార్చేందుకు ట్రై చేస్తున్నారు. రన్ రాజా రన్ కోసం.. గిబ్రాన్ ను పట్టుకొచ్చాడు డైరెక్టర్ సుజీత్. ఇద్దరూ కొత్త టెక్నీషియన్స్ అవడంతో.. ఫ్రెష్ థాట్స్ కారణంగా తక్కువ టైంలోనే సూపర్ హిట్ అయిందీ ఆల్బం.
మరోవైపు గోపీ సుందర్ కూడా టాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నాడు. మళయాళంలో ఎన్నో హిట్ మ్యూజిక్ ఆల్బంస్ ఇచ్చాడు గోపి. ఏడాది క్రితం వరకూ తెలుగు జనాలకు పెద్దగా తెలీదు. కానీ బెంగళూర్ డేస్ తో దేశవ్యాప్తంగా పాపులార్ సంగీత దర్శకుడిగా అవతరించాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు - భలేభలే మగాడివోయ్ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చి ఆకట్టుకోవడమే కాదు.. ఊపిరితో బిగ్ జోనర్ లోకి కూడా ఎంటర్ అవుతున్నాడు.
ఇంక అందాల రాక్షసికి వినూత్నంగా అద్భుతమైన ట్రాక్స్ ఇచ్చి ఆకట్టుకున్నాడు రాధన్. ఆ తర్వాత ఎవడే సుబ్రమణ్యం కూడా జనాలకు బాగానే ఎక్కినా... ఇంకా తెలుగులో సరైన ఆఫర్స్ మాత్రం అందలేదు. స్వామి రారాతో సన్నీ ఎంఆర్.. డిఫరెంట్ మ్యూజిక్ కంపోజర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఉయ్యాలా జంపాలా - రౌడీ వంటి సినిమాలకు ట్యూన్స్ ఇవ్వగా.. మరికొన్ని ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. కార్తికేయతో శేఖర్ చంద్రను తెచ్చాడు చందు మొండేటి. ఈ కంపోజర్ కి కూడా మంచి పేరే వచ్చింది.
వీరంతా టాలీవుడ్ లో కొత్త తరం సంగీత దర్శకుడు. అందరూ ప్రతిభావంతులే. ఎవరి ట్యాలెంట్ వారిదే. మరి వీరిలో అగ్రహీరోల మూవీలకు మ్యూజిక్ అందించే స్థాయికి చేరేదెవరో ?