Begin typing your search above and press return to search.

కొత్తదనం కోరుతున్న మహేష్‌.. వర్కౌట్‌ అయ్యేనా?

By:  Tupaki Desk   |   16 April 2020 12:20 PM IST
కొత్తదనం కోరుతున్న మహేష్‌.. వర్కౌట్‌ అయ్యేనా?
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తదుపరి చిత్రం పరుశురామ్‌ దర్శకత్వంలో అంటూ దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. మైత్రి మూవీస్‌ ఇంకా 14 రీల్స్‌ బ్యానర్‌ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత మహేష్‌ వంశీ పైడిపల్లితో సినిమాను చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను పక్కకు పెట్టి పరశురామ్‌ దర్శకత్వంలో సినిమాకు మహేష్‌ రెడీ అయ్యాడు.

త్వరలో షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ లాక్‌ డౌన్‌ పీరియడ్‌ లో సంగీత చర్చలు జరపాలని భావిస్తున్నారట. అయితే సంగీత దర్శకుడి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయానికి మహేష్‌ బాబు రాలేక పోతున్నట్లుగా తెలుస్తోంది. తన గత చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించడంతో ఈసారి థమన్‌ తో వర్క్‌ చేస్తాడని అంతా అనుకున్నారు. కాని గత కొంత కాలంగా థమన్‌ పాటల గురించి ట్యూన్స్‌ గురించి వినిపిస్తున్న ప్రచారం నేపథ్యంలో కొత్త సంగీత దర్శకుడితో వెళ్లాలని మహేష్‌ బాబు భావిస్తున్నాడట.

సంగీతం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే సినిమా ఫలితం పాజిటివ్‌ గా వస్తుందని ఈమద్య కాలంలో పలు సినిమాల ఫలితాన్ని బట్టి అర్థం అయ్యింది. అందుకే మహేష్‌ బాబు చాన్స్‌ తీసుకోకుండా ప్రస్తుతం ఉన్న వారిని కంటిన్యూ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. కాని మహేష్‌ బాబు మాత్రం ఈసారి కొత్తదనంతోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోపీసుందర్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. రెగ్యులర్‌ గా కాకుండా కొత్తదనంతో ప్రయత్నించాలనుకుంటున్న మహేష్‌ బాబుకు ఆ ఐడియా వర్కౌట్‌ అయ్యేనా చూడాలి.