Begin typing your search above and press return to search.
న్యూ ఇయర్ సందర్భంగా కొత్త సినిమాల సరికొత్త పోస్టర్లు..!
By: Tupaki Desk | 1 Jan 2022 3:00 PM IST2021 ఏడాదిని ముగించుకొని నూతన సంవత్సరం 2022 లో అడుగుపెట్టాం. ప్రతి ఒక్కరూ కొత్త ఆశలు, ఆశయాలతో లక్ష్యాలను నిర్దేశించుకొని కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో గతేడాది కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ జ్ఞాపకాలను వదిలేసి.. న్యూ ఇయర్ లో సరికొత్త విజయాలను అందుకోవాలని ముందుకు సాగుతున్నారు. అందరూ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ సరికొత్త పోస్టర్స్ ని విడుదల చేస్తున్నారు.
2022 ఏడాదికి స్వాగతం పలుకుతూ ''ఆడవాళ్లు మీకు జోహార్లు'' టీమ్ కొత్త పోస్టర్ ని వదిలింది. ఇందులో వర్సటైల్ హీరో శర్వానంద్ - లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. కిషోర్ తిరుమ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. టైటిల్ కు తగ్గట్టుగానే ఇందులో మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.
తాజాగా విడుదలైన పోస్టర్ లో శర్వానంద్ - రష్మిక మందన్నా పెళ్లి దుస్తుల్లో ముస్తాబై కనిపిస్తున్నారు. వీరితో పాటుగా వెన్నెల కిషోర్ - ఊర్వశి - ఖుష్బూ - రాధిక శరత్ కుమార్ పెళ్లి సంబరాల్లో మునిగిపోయారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో తనయుడు, యువ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ''స్వాతిముత్యం''. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఓ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఇందులో హీరోహీరోయిన్లు ఒకరి కౌగిలిలో మరొకరు వదిగిపోయి కనిపిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.
యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''హైవే''. కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. మీర్జాపూర్ - పాతాళ్ లోక్ సిరీస్ లతో తెలుగులోనూ ఫేమస్ అయిన బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జి కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ సయామీఖేర్ ముఖ్య పాత్రలో నటిస్తోంది.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా 'హైవే' పోస్టర్ విడుదల చేశారు. సినిమాలోని ప్రధాన పాత్రల ఇంటెన్స్ లుక్ లను ఆవిష్కరించిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.