Begin typing your search above and press return to search.
బంతి కోర్టులోనే ఉంది కదా అని OTT లు అలా!
By: Tupaki Desk | 8 May 2021 2:00 PM ISTథియేట్రికల్ రిలీజ్ లకు ఆస్కారం లేనప్పుడు ఓటీటీలు ఆదుకుంటాయని కనీస రిటర్న్స్ కి భరోసాని కల్పిస్తాయని టాలీవుడ్ నిర్మాతలు నమ్మారు. కానీ సీన్ ఇప్పుడు రివర్సులో ఉందని తెలుస్తోంది. అప్పులతో ఆర్థిక భారం మోయలేక ఏదో ఒక రేటుకు అమ్ముకునే పరిస్థితి ఇప్పుడు నిర్మాతలకు దాపురిస్తోందట.
నెలల కొద్దీ సమయం కరోనా వల్ల వేస్ట్ అవుతోంది. థియేటర్లలో రిలీజ్ చేయడానికి ఆస్కారం కనిపించడం లేదు. ఇలాంటప్పుడు నష్టాల్ని తగ్గించుకునేందుకు అలాగే వడ్డీల్ని మాఫీ చేసుకునేందుకు ఏదో ఒక రేటుకు ఓటీటీలకు కట్టబెట్టే పరిస్థితి ఉండనుందిట.
ఇటీవల ఒక రెండు మూడు మీడియం బడ్జెట్ సినిమాలకు బేరం పెడితే ఓటీటీలో మరీ దారుణమైన ధరను కోట్ చేశాయని తెలుస్తోంది. అలాగే మొదటి వేవ్ సమయంలో వీ- నిశ్శబ్ధం సినిమాలను కొనుక్కుని నష్టపోయామని కూడా ఓటీటీలు చెబుతున్నాయట. ఏదోలా ఎదుటివారిని తగ్గించి తక్కువ ధరకు సినిమాల్ని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయని నిర్మాతలు వాపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్ మినహా వేరొక సినిమా ఓటీటీలో రిలీజ్ కాకపోవడానికి కారణం బేరాలు తెగకపోవడమేనని తెలిసింది. ఇక పెద్ద సినిమాల్ని ఇప్పట్లో రిలీజ్ చేసే ఆలోచన లేకపోవడంతో ఓటీటీ డీల్స్ ఏవీ లేనట్టే. జనవరి 2022 వరకూ అయినా పెద్ద నిర్మాతలు వేచి చూసే ధోరణితో ఉన్నారని తెలిసింది.