Begin typing your search above and press return to search.

కన్నుగీటిన కుర్రభామ 'ఇష్క్' అంటూ కొత్తసినిమా స్టార్ట్ చేసిందిగా..

By:  Tupaki Desk   |   8 Jan 2021 2:42 PM GMT
కన్నుగీటిన కుర్రభామ ఇష్క్ అంటూ కొత్తసినిమా స్టార్ట్ చేసిందిగా..
X
ప్రియా ప్రకాష్ వారియర్.. సినీ ప్రేక్షకులకు, తెలుగు కుర్రకారుకి పరిచయం అక్కర్లేని పేరు. కేవలం కన్నుగీటిన ఒక్క వీడియోతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయింది. ఓరు ఆధార్ లవ్ సినిమాలో ప్రియా కన్నుగీటిన హావభావాలు కుర్రాళ్ల హృదయాల్లో చిచ్చు రేపాయని చెప్పవచ్చు. లవర్స్ డే సినిమాలోని ఫస్ట్ పాట విడుదలయ్యే వరకు ప్రియా వారియర్ అంటే ఎవరికీ తెలియదు. కానీ ఆమె కన్నుగీటిన వీడియో అంతకుముందే యూట్యూబ్ లో సంచలనం సృష్టించి వైరల్ అయింది. ప్రస్తుతం ఈ కుర్రభామకు తెలుగులో అవకాశాలు బాగానే వస్తున్నాయట. ఇప్పటికే నితిన్ సరసన చెక్ సినిమాలో నటిస్తుండగా.. తాజాగా మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మాణంలో రూపొందే సినిమా కావడం విశేషం. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్‌ బ‌స్టర్ సినిమాలు నిర్మించిన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ 2021లో త‌న తొలి చిత్రం ప్రారంభం చేసింది.

బాలనటుడు నుండి ప్రస్తుతం కుర్రహీరోగా మారిన తేజ స‌జ్జా.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణంలో హీరోకాగా.. అతని సరసన ప్రియా ప్రకాష్ వారియ‌ర్ నాయిక‌గా న‌టించ‌నుంది. ఆర్‌.బి. చౌద‌రి సమర్పణలో ఎన్వీ ప్రసాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు. 'ఇష్క్' అనే టైటిల్ ఖ‌రారు చేసిన ఈ సినిమాకు ఎస్ఎస్ రాజు దర్శకత్వం వహించనున్నాడు. అందరూ లవ్ రొమాంటిక్ మూవీ అనుకుంటుండగా.. 'నాట్ ఎ ల‌వ్ స్టోరీ' అనే ట్యాగ్‌లైన్ తో ఆశ్చర్యం కలిగించారు మేకర్స్. ఈ మూవీకి మ‌హ‌తి స్వర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా.. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌ గా వర్క్ చేయనున్నారు. చూడాలి మరి వింక్ బ్యూటీ ఇష్క్ తో ఎలాంటి మ్యాజిక్ చేయనుందో..!