Begin typing your search above and press return to search.

కొత్త లుక్కులో కిక్కిస్తున్న శాస్త్రీగారు.. ఏంటో క‌థ‌!

By:  Tupaki Desk   |   10 Nov 2022 9:30 AM GMT
కొత్త లుక్కులో కిక్కిస్తున్న శాస్త్రీగారు.. ఏంటో క‌థ‌!
X
రామ‌జోగ‌య్య శాస్త్రి .. టాలీవుడ్ లిరిక్ రైట‌ర్ల‌లో ప్ర‌ప‌ధ‌మంగా వినిపిస్తున్న పేరిది. రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్, అనిల్ రావిపూడి, కొర‌టాల శివ‌, హ‌రీష్ శంక‌ర్, సుకుమార్ వంటి ద‌ర్శ‌కులకు, వారు తెర‌కెక్కించే సినిమాల‌కు ఈయ‌న ఆస్థాన క‌విలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వ‌రంగ‌ల్ ఆర్ ఈసీలో బీటెక్ పూర్తి చేసిన రామ‌జోగ‌య్య శాస్త్రి ఐఐటీ ఖ‌ర‌గ్ పూర్ లో ఎంటెక్ పూర్తి చేశారు. ఆ త‌రువాత బెంగ‌ళూరులో స‌ఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వ‌ర్క్ చేస్తున్న స‌మ‌యంలో క‌న్న‌డ హీరో ర‌విచంద్ర‌న్ సినిమాతో పాట‌ల ర‌చ‌యిత‌గా ప‌రిచ‌యం అయ్యారు.

ఆయ‌న ద్వారా కృష్ణ‌వంశీకి ప‌రిచ‌యం అయిన శాస్త్రి అక్క‌డి నుంచి సిరివెన్నెల సీతారామ‌శాస్త్ర వ‌ద్ద శిష్యుడిగా చేరారు. తొలి సారి 'యువ‌సేన‌' డ‌బ్బింగ్ మూవీకి పాట‌లు రాసిన శాస్త్రి కెరీర్ ని నాగార్జున - శ్రీ‌ను వైట్ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన 'కింగ్‌' సరికొత్త మ‌లుపు తిప్పింది. ఈ మూవీకి ఆన సింగిల్ కార్డ్ రైట‌ర్‌. అక్క‌డి నుంచి వెనుతిరిగి చూసుకోని శాస్త్రిగారు టాలీవుడ్ లో త‌న‌దైన మార్కు పాట‌ల‌తో ర‌చ‌యిత‌గా స‌రికొత్త‌ ట్రెండ్ ని సెట్ చేసుకున్నారు.

ఇండ‌స్ట్రీలో రామ్ జోగా పాపుల‌ర్ అయిన రామ‌జోగ‌య్య శాస్త్రి ఖాతాలో రెండు ఫిల్మ్ ఫేర్ లు, మూడు సైమా అవార్డ్ లు, రెండు నంది పుర‌స్కారాలున్నాయి. 'అల వైకుంఠ‌పుర‌ములో' బుట్ట‌బొమ్మ‌.., RRR లో 'ఎత్త‌ర జెండా..., భీమ్లానాయ‌క్ లో టైటిల్ సాంగ్, వ‌కీల్ సాబ్ లో 'మ‌గువ మ‌గువా..' ఆయ‌న కలం నుంచి జాలువారిన‌వే కావ‌డం విశేషం.

ఇండ‌స్ట్రీలో వున్న అగ్ర ద‌ర్శ‌కుల చిత్రాల‌కు త‌న‌దైన మార్కు పాట‌ల్నీ అందిస్తూ సినిమా విజ‌యాల్లో త‌న‌దైన పాత్ర పోషిస్తున్నారు.

ఎప్పుడూ వైట్ గోటీ తో క‌నిపించే రామ్ జో గారు కొత్త లుక్కులో కిక్కిస్తున్నారు. 'కింగ్' మూవీలో బ్ర‌హ్మ నందం అసిస్టెంట్ గా 'భ‌ర‌త్ అనే నేను' మూవీలో 'వ‌చ్చాడ‌య్యో సామీ'.. పాట‌లో చిన్న పాత్ర‌లో మురిసిన రామ‌జోగ‌య్య శాస్త్రి కొత్త లుక్ లోకి మారిపో నున్న‌ని గుండుతో సూటు వేసుకుని, త‌న వైట్ గోటీకి బ్లాక్ క‌ల‌ర్ వేసుకుని స్టైల్ గా క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. ఏదైనా సినిమా కోస‌మా లేక ఛేంజ్ కోస‌మా అనేది తెలియాల్సి వుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.