Begin typing your search above and press return to search.

కొత్త కథానాయికలు బాగానే క్లిక్ అయ్యారు

By:  Tupaki Desk   |   8 Dec 2017 11:00 PM IST
కొత్త కథానాయికలు బాగానే క్లిక్ అయ్యారు
X
టాలీవుడ్ లో కథానాయికల కొరత చాలానే ఉందనుకుంటున్న సమయంలో చాలా మంది లేలేత ముద్దుగుమ్మలు ఈ ఏడాది ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తెలుగులో ఒక్క హిట్టు కొట్టినా చాలు బి టౌన్ లో కూడా ఈజీగా అవకాశాలు అందుకోవచ్చు అనే ఆలోచనతో వచ్చే భామలు చాలానే ఉన్నారు. అయితే హీరోయిన్స్ సంఖ్య కూడా బాగా పెరిగిపోవడంతో పోటీ కూడా చాలానే పెరిగింది. అయితే హిట్టు పడకపోయినా పర్వాలేదు గాని అందంతో నటనతో అవకాశాలను అందుకోవాలని నయా హీరోయిన్స్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫిదా - అర్జున్ రెడ్డి సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాల్లో నటించిన సాయి పల్లవి - షాలిని పాండే తెలుగులో మొదటి సారి ఎంట్రీ ఇచ్చి మంచి ఆదరణను దక్కించుకున్నారు. ఒకరు మాటలతో ఆకట్టుకుంటే మరొకరు మాటలకు రొమాన్స్ కూడా యాడ్ చేసి క్యూట్ గా అందరిని మెప్పించారు. ఇక రీసెంట్ గా వచ్చిన నివేత పెతురాజ్ కూడా కొంచెం హాట్ టాపిక్ అయ్యిందనే చెప్పాలి. సింపుల్ గా మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ కోలీవుడ్ భామ తన నటనతో అందరిని ఆకర్షించింది. ఇక త్వరలో హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్న కళ్యాణి ప్రియదర్శిని పై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఆ సినిమా హిట్ అయితే అవకశాలు రావచ్చు. ఇకపోతే లై సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మేఘ ఆకాష్ గ్లామర్ తో ప్రేక్షకులను బాగానే మెప్పించింది గాని.. సినిమా మాత్రం అమ్మడికి నిరాశనే మిగిల్చింది. కానీ మేఘ కి అవకాశాలు మాత్రం తగ్గలేదు. మరో రెండు సినిమాలను చేయడానికి రెడీ అయ్యింది.

అదే విధంగా గురు సినిమాలో వెంకటేష్ స్టూడెంట్ గా కనిపించిన రితికా సీంగ్. మంచి గుర్తింపు అందుకున్నా కూడా ఎక్కువగా అవకాశాలు అందుకోలేదు. ఇక ఎప్పటిలానే ఈ సారి మరికొంత మంది హీరోయిన్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు పూరి జగన్. ఫారిన్ బ్యూటి ఏంజెలా క్రిసిలెంజ్కి - ముస్కాన్‌ సేథి - కైరా దత్‌ తదితర భామలు ఆయన ద్వారానే టి టౌన్ కి వచ్చినవారే.. అలాగే మెహబూబా ద్వారా బ్యూటీ నేహా శెట్టిని కూడా పరిచయం చేస్తున్నాడు.

వీరితో పాటు మరికొంత మంది కొత్త భామలు కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. మరి వీరిలో ఎవరు ఫాస్ట్ గా స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుంటారో చూడాలి.