Begin typing your search above and press return to search.

మహేష్-కొత్త హీరోయిన్.. ఈసారి ఏమవుతుందో?

By:  Tupaki Desk   |   8 March 2017 7:59 AM GMT
మహేష్-కొత్త హీరోయిన్.. ఈసారి ఏమవుతుందో?
X
సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు పెద్ద పీట వేస్తారు. ఒక కాంబినేషన్ ఒకటికి రెండుసార్లు తేడా కొట్టిందంటే మళ్లీ దాని జోలికి వెళ్లరు. సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో ఒక బ్యాడ్ సెంటిమెంటు ఉంది.అతడి పక్కన కొత్త హీరోయిన్ నటిస్తే ఆ సినిమా సరిగా ఆడదన్నది ఆ సెంటిమెంటు. నమ్రతా శిరోద్కర్ తో చేసిన ‘వంశీ’.. లిసారే.. బిపాసా బసులతో చేసిన ‘టక్కరి దొంగ’.. అమృతా రావుతో చేసిన ‘అతిథి’.. కృతి సనన్ తో చేసిన ‘1 నేనొక్కడినే’ ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయి. దీంతో దర్శక నిర్మాతలు అతడి పక్కన కొత్త హీరోయిన్ని పెట్టడానికి జంకుతుంటారు. చివరగా ‘1 నేనొక్కడినే’తో ఈ సెంటిమెంటు పునరావృతం కావడంతో అప్పట్నుంచి మళ్లీ మహేష్ పక్కన ఏ కొత్త హీరోయిన్ నటించలేదు.

ఐతే ఈ సెంటిమెంటును దృష్టిలో పెట్టుకోకుండా కొరటాల శివ మాత్రం ఓ కొత్త అమ్మాయిని ప్రిన్స్ పక్కన నటింపజేయాలని చూస్తున్నట్లు సమాచారం. ‘భరత్ అను నేను’ అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలోనే షూటింగ్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి ముందు కీర్తి సురేష్ ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఎందుకో ఆమెను పక్కనబెట్టేశారు. వేరే హీరోయిన్లు ఇద్దరు ముగ్గురిని పరిశీలించిన అనంతరం.. కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని కొరటాల ఫిక్సయ్యాడట. అందుకోసం వేట కూడా మొదలైందట. ఐతే మహేష్ అభిమానులు మాత్రం సెంటిమెంటు గుర్తు చేసుకుని కంగారు పడుతున్నారు. మరి కొరటాల ఈ సెంటిమెంటును బ్రేక్ చేస్తాడేమో చూడాలి. మేలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/