Begin typing your search above and press return to search.

మహేష్ కోసం లైన్లో కొత్త భామ?

By:  Tupaki Desk   |   6 Feb 2017 12:26 PM IST
మహేష్ కోసం లైన్లో కొత్త భామ?
X
మహేష్ బాబు మూవీని శరవేగంగా రూపొందించాలని దర్శకుడు మురుగదాస్ ఆలోచన. ముందుగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం అయితే.. ఈ పాటికే పూర్తయిపోవాలి కూడా. కానీ ఇంకా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతూనే ఉంది. కనీసం టైటిల్ ని కానీ.. ఫస్ట్ లుక్ ని కూడా కానీ ఇవ్వలేకపోయారు.

మరోవైపు మహేష్ తో శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ అందించిన కొరటాల శివ.. సూపర్ స్టార్ తో తన తర్వాతి సినిమాకి రెడీ అయిపోతున్నాడు. ఈ చిత్రం ద్వారా కొత్త హీరోయిన్ ను పరిచయం చేయాలని.. మహేష్ కి కొత్త జోడీ వెతకాలని భావిస్తున్నాడట కొరటాల. మార్చ్ చివరలో కానీ.. ఏప్రిల్ మొదట్లో కానీ ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉండడంతో.. హీరోయిన్ ను ఫైనలైజ్ చేయడంలో కొరటాల తొందరపడ్డం లేదని తెలుస్తోంది. ప్రధానంగా కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకునే ఆలోచన వెనక.. కొరటాల ఆలోచన వేరే ఉందంటున్నారు.

ఒకసారి షూటింగ్ ప్రారంభించాక.. శరవేగంగా కంప్లీట్ చేసేలా డేట్స్ ఇచ్చే హీరోయిన్ కావాలని చూస్తున్నాడట దర్శకుడు. అందుకే కొత్త అమ్మాయిని తీసుకోవడం ద్వారా.. ఈ టార్గెట్ నెరవేరుతుందని.. మరోవైపు ఫ్రెష్ పెయిర్ ని చూపించచ్చని భావిస్తున్నాడని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/