Begin typing your search above and press return to search.

బాలయ్యకి హీరోయిన్ దొరికిందట..!

By:  Tupaki Desk   |   2 May 2020 1:30 AM GMT
బాలయ్యకి హీరోయిన్ దొరికిందట..!
X
తెలుగు పరిశ్రమలో గత కొంతకాలంగా నటసింహం బాలకృష్ణ. తన అభిమానులను వరుస ప్లాప్ సినిమాలతో నిరాశపరుస్తున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు - మహానాయకుడు మరియు రూలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కట్టాయి. ఇప్పుడు బాలకృష్ణకి హిట్టు తప్పనిసరి అయిపొయింది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌ లో వచ్చిన సింహా - లెజెండ్‌ సినిమాలు మంచి విజయం సాధించటంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా - తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా బాలయ్య 106వ సినిమాగా రూపొందుతుంది.

తాజాగా బాలయ్య-బోయపాటి సినిమాల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమా మొదటి నుండి కూడా కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తాం అంటూ వస్తున్నాడు బోయపాటి. అయితే తాజా కథనాల ప్రకారం.. బాలయ్య బాబు పక్కన నటించడానికి ప్రస్తుత హీరోయిన్స్ ఎవరూ ముందుకు రావడం లేదని వార్తలొచ్చాయి. బాలయ్య చాలా సీనియర్ హీరో అవడంతో ఆయనతో సినిమా చేస్తే వాళ్ల కెరీర్ ముగుస్తుందని అనుకున్నారట. అందుకోసమే కొత్త వాళ్ల కోసం వెతుకుతున్నారని వినికిడి. తాజాగా డైరెక్టర్ బోయపాటి ఇదివరకే ఇద్దరు కొత్త హీరోయిన్లను సెలెక్ట్ చేసినట్లు తెలిపారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఆ ఇద్దరిలో ఓ హీరోయిన్ ఫైనల్ అయ్యిందట. ఇక ఆ కొత్త హీరోయిన్ కూడా ముంబైకి చెందిందని టాక్. ఇక లాక్ డౌన్ అయితే సినిమా పట్టాలెక్కిద్దామని చూస్తున్నారట టీమ్. చూడాలి మరి కొత్త హీరోయిన్ కి బాలయ్య సినిమా ఏ విధంగా హెల్ప్ అవుతుందో..!