Begin typing your search above and press return to search.

రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో!

By:  Tupaki Desk   |   3 Jun 2022 9:30 AM IST
రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో!
X
సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల ఇంటి నుంచి వలసలు రావడం సర్వసాధారణమే అనే చెప్పవచ్చు. అయితే ఆ రూట్లో వస్తున్న అందరూ కూడా సక్సెస్ అవుతారని గ్యారెంటీ లేదు. టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం ఉంటేనే చిత్ర పరిశ్రమలో వారికంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోవడానికి వీలు ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సపోర్టు లేకుండా సోలోగా కష్టపడి పైకొచ్చిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు.

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్న రవితేజ ఫ్యామిలీ నుంచి త్వరలోనే ఆయన కుమారుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు అని తెలుస్తోంది.

రవితేజ కుమారుడు మహాధన్ ఇదివరకే రాజా ది గ్రేట్ సినిమా లో చిన్నప్పటి రవితేజ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే మరొక వైపు రవితేజ సోదరుడు రఘు కొడుకు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అతని పేరు మాధవ్. అతను 21 ఏళ్ల వయసుకు రావడంతో తన పెద నాన్న సపోర్ట్ తోనే మొదటి సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రవితేజ ఆధ్వర్యంలోనే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కథా చర్చలు కూడా జరిపినట్లు టాక్ వినిపిస్తోంది.

రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే మాధవ్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. త్వరలోనే అఫీషియల్ గా లాంచ్ చేసి టైటిల్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కూడా మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి రవితేజ సపోర్ట్ తో రాబోయే వారి వారసులు ఇండస్ట్రీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.