Begin typing your search above and press return to search.

ఆ బ్రాండ్ నే నమ్మమంటున్న యంగ్ టైగర్

By:  Tupaki Desk   |   15 May 2019 1:49 PM IST
ఆ బ్రాండ్ నే నమ్మమంటున్న యంగ్ టైగర్
X
స్టార్ హీరోస్ లో మహేష్ బాబు తర్వాత బ్రాండ్ ఎండార్సింగ్ లో యాక్టివ్ గా ఉండేది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆరే. ఈ మధ్య కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నా మళ్ళి ట్రాక్ లోకి వచ్చేశాడు. ప్రముఖ మెన్స్ వేర్ బ్రాండ్ ఒట్టో కోసం తారక్ కొత్త యాడ్ ఒకటి చేశాడు. అందులో ఒట్టో బ్రాండ్ గురించి చెబుతూ అందులో దొరికే వైరెటీలు జీన్స్ టీ షర్ట్స్ మొదలుకుని మగాళ్లకు కావాల్సిన దుస్తులన్నీ ఎలా దొరుకుతాయో ఫ్రేమ్ ఫ్రేమ్ కి తనే డ్రెస్సులు మార్చుకుని మరీ చూపించాడు.

ఆ బ్రాండ్ సంగతేమో కానీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉండగా మధ్యలో బ్రేక్ తీసుకుని చేసిన యాడ్ కాబట్టి తారక్ లుక్ ఎలా ఉండబోతోందో మరింత స్పష్టంగా క్లారిటీ వచ్చింది అభిమానులకు. ఇప్పుడీ బ్రాండ్ జూనియర్ పుణ్యమా అని అందరికి రీచ్ అయిపోతోంది. ఎన్టీఆర్ చెప్పాడు కాబట్టి క్వాలిటీ ఉంటుందనే ఉద్దేశంతో కొనేవారు ఉండకపోరు. చేతికి తగిలిన చిన్న గాయం కూడా మానినట్టే ఉంది యాడ్ చూస్తుంటే.

గతంలోనూ కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేసిన తారక్ ఇందులో కూడా తన స్టైల్ చూపించాడు. గత ఏడాది అరవింద సమేత వీర రాఘవ హిట్టు కొట్టాక వెంటనే ఆర్ఆర్ఆర్ కోసం జాయిన్ అయిపోవడంతో ఏడాదిన్నర గ్యాప్ తర్వాత తమ అభిమాన హీరోని తెరమీద చూడగలరు ఫ్యాన్స్. అప్పటిదాకా రాజమౌళి ఇచ్చే అప్ డేట్స్ కోసం ఓపిగ్గా ఎదురు చూడటం తప్ప ఇంకేమి చేయలేరు