Begin typing your search above and press return to search.

మెగా కోడలి సెలబ్రిటీ హంగామా

By:  Tupaki Desk   |   6 July 2019 6:03 AM GMT
మెగా కోడలి సెలబ్రిటీ హంగామా
X
రామ్ చరణ్ లైఫ్ పార్ట్ నర్ గా మెగా ఫ్యాన్స్ లో గుర్తింపు ఉన్నప్పటికీ అపోలో సంస్థలో కీలక పదవితో పాటు సామాజిక జీవనంలో మనుషుల ఆరోగ్య రక్షణ గురించి తన వంతు బాధ్యతగా సోషల్ మీడియా సహాయంతో కార్యక్రమాలు చేసే మెగా కోడలు ఉపాసన ఇటీవలే సెలబ్రిటీలతో యూట్యూబ్ లో టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఆరోగ్యవంతులైన వాళ్ళను ఎన్నుకుని మరీ చేస్తున్న ఈ షోకు రెస్పాన్స్ బాగుంది. సమంతా ఇప్పటికే సందడి చేసింది. చెర్రీ చిరులకు బెస్ట్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ తన వంతుగా పార్టిసిపేషన్ ఇచ్చాడు. మరో ఫ్రెండ్ సానియా మిర్జా కూడా తోడయ్యింది. ఇలా ఉపాసన సెలెక్ట్ చేసుకుంటున్న సెలెబ్రిటీలు మొత్తానికి షోని భలేగా నడిపిస్తున్నారు.

తాజాగా కత్రినా కైఫ్ కూడా వచ్చేసింది. అయితే వీడియోలో ఉపాసన లేకపోవడం చిన్న లోటుగా అనిపించినా ఆ తరువాత జరిగిన గ్రీటింగ్ ఫోటో షూట్ లో ఇద్దరు కలిసి స్టిల్ ఇవ్వడం బాగా క్లిక్ అయ్యింది. ఉపాసన ఆధ్వర్యంలో నిర్వహింపబడే బి పాజిటివ్ మ్యాగజైన్ కు కత్రినా కైఫ్ ఫోజే లేటెస్ట్ ఇష్యూ కు అట్రాక్షన్ గా మారింది. ఇదంతా ఓకే కానీ రామ్ చరణ్ తో లేదా మెగా ఫామిలీ హీరోస్ తో ఉపాసన ఇంటర్వ్యూ చేయడం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా భర్త ఫిట్ నెస్ సీక్రెట్స్ తెలుసుకోవాలని ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి అది ఎప్పుడు నెరవేరుతుందో